సీఎం రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా:ఏప్రిల్ 19
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేయి వేస్తే మాడి మసై పోతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల కేసీఆర్ మాట్లాడు తూ, తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చేసిన కామెంట్‌పై స్పందించారు. ఇక్కడ కాపలా ఉన్నది తానేనని. తమ ఎమ్మెల్యేలను ముట్టు కుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి నామి నేషన్ ర్యాలీ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చాక పాల మూరుకు కేసీఆర్ చేసింది ఏమిటని ప్రశ్నించారు.
పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ ఇస్తే.. కేసీఆర్ నిర్మించారా? అని నిలదీశారు. ఏం చేశారని పాలమూరు ప్రజలు బీఆర్ ఎస్‌కు ఓటేయాలన్నారు. పార్లమెంట్లో నిద్రపోవడా నికి బీఆర్ఎస్కు ఓటు వేయాలా అన్నారు.
కారు రిపేర్‌కు వెళ్లిందని కేటీఆర్ అన్నారని.. 2009 లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తరిమికొట్టార న్నారు. కారు షెడ్డు నుంచి బయటకు రాదని, అది పూర్తిగా పాడైపోయింద న్నాని వ్యాఖ్యానించారు…