వైసీపీ నాయకుల బొమ్మలు వేసిన టీ కప్పులు మాకోద్దంటున్న షాపు యజమానులను పోలీసులు బెదిరిస్తున్నారు
విధులు సక్రమంగా నిర్వర్తించలేని పోలీసులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు..? ఏం రక్షణ కల్పిస్తారు..?
లంఛాలు తిని బొజ్జలు పెంచిన 74 అవినీతి కొండలకు క్లీన్ చీట్ ఇచ్చిన మరో అవినీతి అనకొండ జగన్ రెడ్డి
జగన్ రెడ్డంటే అత్యంత భయభక్తులు, వినయవిధేతలు చూపించడంలో విజయవాడ పోలీసుల కమిషనర్ మునిగిపోయారు
హత్యాయత్నమే జరగని కేసులో బోండా ఉమాను ఇరికించేందుకు వైసీపీ నాయకులతో సీపీ కుట్ర పన్నారు
వర్ల రామయ్య
వెలగపూడి, ప్రధాన ప్రతినిధి : ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్‌లపై, వారికి సహకరిస్తున్న అధికారులపై, అలాగే జగన్ రెడ్డి అసలు హత్యాయత్నమే జరగకుండా హత్యాయత్నం కేసు పెట్టి అందులో టీడీపీ నేత బోండా ఉమాను ఇరికేందుకు వైసీపీ నాయకులతో కలిసి విజయవాడ పోలీసు కమిషనర్ కుట్ర పన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న 74 మంది అధికారులకు ప్రభుత్వం క్లీన్ చీట్ ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఈవోను వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ…”రాష్ట్రంలో ఎక్కడ అవకతవకలు జరిగినా, ఎన్నికల కోడ్‌ను ఎవ్వరు ఉల్లంఘించినా, జగన్ రెడ్డి, అతని టీమ్ చేస్తున్న దౌర్జన్యాలను ప్రతీ రోజు ఎన్నికల కమిషన్‌కు మేము ఫిర్యాదులు చేస్తునే ఉన్నాం. కానీ చాలా మందిపై ఇప్పటికీ చర్యలు లేవు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. కానీ వైసీపీ బరితెగించి ప్రవర్తిస్తుంది. సత్తెనపల్లిలో మంత్ర అంబటి రాంబాబు టీ కప్‌లపై అతని బొమ్మ, ఎంపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ బొమ్మను వేసుకొని ప్రతీ టీ స్టాల్‌కు పంపిణీ చేశారు. ఎవరికైనా ఆ టీ కప్పుల్లోనే టీ పోసి ఇవ్వాలి, ఎవ్వరైనా ఆ టీ కప్పుల్లోనే టీ తాగాలంటూ ఎన్నికల నియావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మేము ఆ టీ కప్పుల్లో టీ ఇవ్వమని మా తెలుగుదేశం పార్టీకి చెందిన టీ షాపుదారులు అంటే మంత్రి చెబితే వినాల్సిందే లేదంటే బొక్కలో వేస్తానని ఓ పోలీసు అధికారి బెదిరిస్తున్నాడు. విధులను సక్రమంగా నిర్వర్తించడం రాని ఆ అధికారి ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తాడు” అని అన్నారు.
అవినీతి కొండలను బంగారు కొండలుగా క్లీన్ చీట్ ఇచ్చిన గజ దొంగ జగన్ రెడ్డి
“లంఛాలు తిని బొజ్జలు పెంచిన 74 మంది అధికారులకు జగన్ రెడ్డి క్లీన్ చీట్ ఇచ్చాడు. వీరు అవినీతిపరులు కారు, ఇటువంటి నీతిమంతులు లేరని, మేము రాజకీయంగా కొట్టేస్తాం, మీరు అధికారికంగా కొట్టేయండని మార్కెట్లోకి జగన్ రెడ్డి 74 మందిని వదిలాడు. దేశ చరిత్రలో ఇంతమందికి క్షమాభిక్షణ పెట్టిన దాఖలు లేవు. ముఖ్యమంత్రికి క్షమాభిక్షణ పెట్టే హక్కు ఉన్నా నెలకు ఒక్కరి మీద కూడా సాధారణంగా చేయరు. కానీ 43 వేల కోట్లు కొట్టేసారని సిబిఐ సర్టిఫై చేసిన అత్యంత నిజాయితీపరుడు, ఆర్థిక నేరాల వైపు కన్నెత్తి చూడని మన ముఖ్యమంత్రి 74 అవినీతి కొండలను నీతిమంతులను చేశారు. ఇది అన్యాయం. ఖచ్చితంగా వీటిపై విచారణ జరగాలి” అని కోరారు.
సీఎం జగన్ రెడ్డిపై విజయవాడ పోలీసు కమిషనర్ స్వామి భక్తి….
బోండా ఉమాపై తప్పుడు కేసు పెట్టాలని విజయవాడ పోలీసు కమిషనర్ జగన్ రెడ్డిపై స్వామి భక్తి చూపుతున్నాడు. జగన్ రెడ్డిపై అసల హత్యాయత్నమే జరుగలేదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయితో చంపగలరా..! ఇప్పుడ సతీష్ అనే ఒక అమాయకుడిని తీసుకొచ్చి వీడే హత్యాయత్నం చేయబోయిన హంతకుడు అని చూపిస్తున్నారు. కమిషనర్ ఎందుకు తప్పటడుగులు వేస్తున్నారో అర్థవ కావట్లేదు. రానున్న రోజుల్లో అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే. జగన్ రెడ్డి అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు ప్రజలు సిద్ధమై మా వైపు మొగ్గు చూపుతున్నారు. అవినీతి చేసిన, తప్పుడు కేసులు పెట్టిన, చట్టపరిధిని దాటి వ్యవహరించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని వర్ల హెచ్చరించారు. ఇంకా ఈసీని కలిసిన వారు మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ, తెదెపా రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వినర్ బుచ్చి రాంప్రసాద్, గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.