క్రమం తప్పకుండా ప్రతి రోజూ నివేదికలు పంపేందుకు సిద్దంకండి*
సి-విజిల్ పిర్యాదులను సంతృప్తికర స్థాయిలో పరిష్కరిస్తున్నందుకు డిఇఓ లకు అభినందనలు
పోలింగ్ పక్రియ,కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్అయ్యేలా చర్యలు తీసుకోండి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా
అమరావతి, ప్రత్యేక ప్రతినిధి : ఈ నెల 18 న నోటిఫికేషన్ జారీతో ప్రారంభమయ్యే అసలైన ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారులు అందరూ సిద్దం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించడంతో పాటు ప్రతి రోజూ క్రమం తప్పకుండా నివేదికలను పంపేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మీడియో కాన్పరెన్సు నిర్వహించి అసలైన ఎన్నికల ప్రక్రియ ప్రారంభం సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన దిశ నిర్థేశం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 18 న తేదీన నోటిఫికేషన్ జారీ నుండి నివేదికలను ప్రతి రోజూ ఈసీఐ కి పంపాల్సి ఉంటుందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలసత్వం వచ్చించకుండా క్రమం తప్పకుండా ప్రతి రోజూ నివేదికలు పంపాలన్నారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని కార్యాలయాల్లోగాని, పోస్టాఫీసుల్లో గాని ఎపిక్ కార్డులు ఏమాత్రం పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీపై మే 4న ఈసీఐ వీడియోకాన్పరెన్సు నిర్వహిస్తున్నదని, ఈ లోపుగానే పెండింగ్ లో ఉన్న కార్డుల పంపిణీని పూర్తిచేయాలని ఆదేశించారు. సి-విజిల్ పిర్యాదులను సంతృప్తికర స్థాయిలో డి.ఇ.ఓ.లు అందరూ పరిష్కరిస్తున్నారని అభినందించారు. ఆస్తుల అక్రమ రవాణాను నియంత్రించడం, స్వాదీనం చేసుకోవడంలో కూడా మంచి ప్రగతిని కనబరుస్తున్నారని, అయితే కోనసీమ, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి వంటి జిల్లాలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఆయా జిల్లాలు కూడా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో సామాన్య ప్రజలను ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌంటిగ్ సెంటర్లకు పరిశీలకును నియమించే విషయంలో ఈసీఐ మార్గదర్శకాలను పాటించాలని, అదనంగా కాల్సిన పరిశీలకులు, ఏఆర్ఓల ప్రతిపాదలను సాద్యమైనంత త్వరగా తమకు పంపాలని ఆదేశించారు. పోలింగ్ పక్రియ, కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా గరిష్ట స్థాయిలో కవర్అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాటు అదనపు సీఈఓ పి.కోటేశ్వరరావు, జాయింట్ సీఈఓ ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.