తాగునీటి ఎద్దడి ఉన్న ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేయండి
అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి
ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలకు స్క్రీనింగ్ కమిటీలో ఆమోదం ఇస్తాం
ఉపాధి హామీ పథకంలో వాటర్ కన్జర్వేషన్ పనులను వెంటనే మొదలు పెట్టండి
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోండి
సీఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి, ప్రధాన ప్రతినిధి రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్, మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు మంగళవారం వెలగపూడి సచివాలయం నుండి తాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీ ఎస్ మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇంకా రెండు జిల్లాల నుండి ప్రతి పాదనలను రావాల్సి ఉందని అవి వస్తే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తగిన అనుమతులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి తాగునీటి అవసరాలకై పల్నాడు,ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపేందుకు ఈనెల 8నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.అలాగే ప్రకాశం బ్యారేజి నుండి ఎన్టిఆర్,కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాలకు కాలువల ద్వారా ఈనెల 6 నుండి నీటిని విడుదల చేశామని తెలిపారు. వెంటనే అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈవేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో 1669 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను 101 కోట్ల రూ.లతో మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని అపనులు వారం రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కల్పనపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షిస్తూ ఈ పధకం కింద ప్రతిపాదించిన వాటర్ కన్జర్వేషన్ పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు.గత మూడు రోజుల్లో ఉపాది హామీ రోజువారీ పనులు 11లక్షల నుండి 22 లక్షల పని దినాలకు పెరగడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఉపాది హామీ పనులు కల్పనలో శ్రీకాకుళం,విజయనగరం జిల్లా లు ముందంజలో ఉండడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్రంలో వేసవి దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు.రానున్న రోజుల్లోను డిమాండ్ కు సరిపడా విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర జలవనరులు, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ కె.కన్నబాబు, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఇఎన్సి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా సిడిఎంఏ శ్రీకేశ్ బాలాజీ రావు, జల వనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.