విజయవాడ బ్యూరో ప్రతినిధి : పెనమలూరు శాసనసభ నియోజకవర్గ వైసిపి ఎన్నికల ఇన్చార్జిగా వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు. తన నియామకం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు , కృష్ణ గుంటూరు జిల్లాల వైసిపి ఎన్నికల ఇన్చార్జ్ అయోధ్య రామిరెడ్డి, రాష్ట్రమంత్రి జోగిరమేష్ కు ఆకుల శ్రీనివాస్ కుమార్ ధన్యవాదములు తెలియజేశారు. కాగా సింగ్ నగర్ లో జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి జగన్ ను కేసరపల్లి వద్ద కలిసిన ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ఘనవిజయం సాధించి మళ్లీ జగనన్న సీఎం కావడం ఖాయమని ఆకుల ఈ సందర్భంగా పేర్కొన్నారు.