అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు
అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్న నేత ముఖ్యమంత్రి వైయస్ జగన్
అంబేద్కర్ కోరుకున్నసామాజిక సాధికారితను నెరవేర్చిన వైయస్ జగన్
అంబేద్కర్ జయంతి సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు జిల్లా నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు ఎంఎల్సిలు లేళ్ళ అప్పిరెడ్డి, పోతుల సునీత పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి భిన్న సంస్కృతులకు వేదికగా ఉన్న భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడంలో అంబేద్కర్ కృషి మరవలేనిదన్నారు. ఆయన కలలుగన్న ప్రజాస్యామ్య, సామ్యవాద సమాజాన్ని నిర్మించేదిశగా జగన్ గారు పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక ఆచరణలో పేదరిక నిర్మూలన దిశగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారన్నారు. కీలకరంగాలపై దృష్టిపెట్టి ఐదేళ్ళలో ఎంతో అభివృధ్ద్ది సాధించారన్నారు.పార్టీ,ప్రభుత్వం పేదల జీవితాలలో వెలుగులు నింపేలా పనిచేశాయన్నారు. మాటల్లోనే కాదు ఆచరణలో చేసి చూపిన ఘనత జగన్ దన్నారు. మూస ధోరణిలో సాధారణ రాజకీయనేతల వలే కాకుండా విశ్వసనీయతే ప్రాతిపదికగా విప్లవాత్మకమైన మార్పులు దిశగా అడుగులు వేశారన్నారు. ముఖ్యంగా బడుగు,బలహీన వర్గాలు తమ నిర్ణయాలు తాము తీసుకుని వారి కాళ్ళపై వారు నిలబడేలా చేశారన్నారు.
శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు
చేసిన ఘనత వైయస్ జగన్ దన్నారు.కేవలం జయంతులు, వర్ధంతులు సమయంలో విగ్రహాలకు దండలు వేసి మొక్కుబడిగా కాకుండా అంబేద్కర్ ఆశయాలను తూచతప్పకుండా అమలు చేస్తున్న నాయకుడు జగన్ అన్నారు.
మాజి మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తున్న వైయస్ జగన్ కి అందరూ అండగా నిలబడాలని కోరారు. పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశానికి దశ,దిశ చూపేలా రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ దని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, బత్తుల బ్రహ్మనందరెడ్డి, నవరత్నాల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.