అక్రమ రవాణా భాదిత మహిళల ఫోరం వినతి
విజయవాడ, ప్రధాన ప్రతినిధి : మనవ అక్రమ రవాణా భాదితులు, సెక్స్ వర్కర్స్ తమ జీవితం లో ప్రతి అంశం లోను, కుటుంబం, సమాజం ప్రభుత్వాల నుంచి కూడా వివక్షత, కళంకం ఎదుర్కొంటూ కనీసం పునరావాసంతో పాటు నష్టపరిహారం అందక చాలా దయనీయ స్థితి లో బ్రతుకులు వెళ్ళదీస్తూ ఉన్నారని వీరి సమస్యలు పై రాజకీయ పార్టీలు ద్రుష్టి పెట్టి తమ ఎన్నికల మేనిఫెస్టో లో తమకు హామీ ఇవ్వాలని కోరుతూ అక్రమ రవాణా భాదితులు మరియు సెక్స్ వర్కర్స్ రాష్ట్ర సమాక్య “విముక్తి” తమకు మద్దతు ఇచ్చే స్వచంద సంస్థలు తో కలిసి తమ డిమాండ్ ల చార్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం లో విముక్తి రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి ఎన్. అపూర్వ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2022 నాటికీ రాష్ట్రంలో షుమారు 1.40 లక్షల మంది వ్యభిచారం లో ఉన్నారని, దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానం లో ఉందని అంటూ .. ఈ వృత్తిలోనికి ప్రవేశించే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పెరుగుతోంది. ప్రధానంగా జీవనోపాధి లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, ఉపాది, ఉద్యోగ అవకాశాలు పేరిట మోసపోయి ఈ వృత్తిలోనికి వచ్చే వాళ్లు ఏటా పెరుగుతున్నారు. 10 నుంచి 15 శాతం మంది ఈ వృత్తిలోనికి వస్తున్నారని అంచనా. కొత్తగా వృత్తిలోకి వస్తున్నవారి వయసు సరాసరి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటోంది. ఇదేవిధంగా వయసు రీత్యా ఈ వృత్తి నుంచి వైదొలుగుతున్న వారు కూడా 10 శాతం వరకు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముక్యంగా అక్రమ రవాణా భాదిత మహిళలకు, సెక్స్ వర్కర్స్ కు పునరావాసం కల్పించడం లోను, వారికీ నష్టపరిహారం అందించి వీరిని జనజీవన స్రవంతి లో చేర్చడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు.
విముక్తి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పుష్ప మాట్లాడుతూ “వృత్తితో సంబంధం లేకుండా, ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని చెప్పనవసరం లేదు.” అయితే ఈ ప్రాథమిక హక్కు నేడు సెక్స్ వర్కర్లు మరియు వారి పిల్లలకు అందుబాటులో లేదు, ఫలితంగా వారు, వారి పిల్లలు గౌరవంగా జీవించే హక్కును కోల్పోయి తమ పనికి సంబంధించిన సామాజిక కళంకాన్ని భరించి, సమాజంలోని వివక్ష కు గురికాబడుతూ ఉన్నారు. ఇందుకు ఉదాహరణ వీరి పిల్లలకు పాఠశాలలో ప్రవేశం మరియు ఉద్యోగాలలో ప్రవేశం మరియు సేవల రంగంలో కెరీర్ అవకాశాలు వంటి ప్రజా సంక్షేమ సేవలను పొందటంలో వారు తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న పార్టీలు లేదా అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విముక్తి రాష్ట్ర సమాక్య నిర్ణయించిందని ఆమె అన్నారు.
ఈ డిమాండ్ పత్రం లో బాధితులకు కమ్యూనిటి ఆధారిత పునరావాసం కల్పించాలని, ప్రాథమిక సేవలు, విద్య, 40 ఏళ్ల దాటిన ప్రతి సెక్స్ వర్కర్ కు పెన్షన్ సుదుపాయం కల్పించాలని, భాదిత మహిళల అందరికి నష్టపరిహారం 3 నెలలో అందేలా చూడాలని, అక్రమ రవాణా వ్యవస్థను ఎదుర్కోవడానికి ఒక బలమైన కొత్త వ్యవస్థ కోసం చట్టం రుపొందిచాలని, రాష్ట్రం లో కోతగా ఏర్పాటు చేసిన యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ నేరుగా అక్రమ రవాణా కేసులు చేపట్టేలా చూడాలని, ప్రభుత్వ విధాన రూపకల్పన మరియు వాటి అమలు, పర్యవేక్షణ వంటి కార్యక్రమాల్లో సెక్స్ వర్కర్స్ మరియు అక్రమ రవాణా భాదితులను పాల్గొనేలా చర్యలు చేపట్టడం తో పాటు తొమ్మిది డిమాండ్లు అ వినతి పత్రం లో ఉన్నాయి.
ఈ సమావేశంలో విముక్తి నాయకులు శ్రీమతి శాంతి, సల్మా తో పాటు హెల్ప్ ప్రోగ్రాం మేనేజర్ వి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు