సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం – మల్లాది విష్ణు
విజయవాడ బ్యూరో ప్రతినిధి: స్థానిక ఆంధ్రప్రభ కాలనీలో గల వైస్సార్సీపీ కార్యాలయం నందు మేమంతా సిద్ధం బస్సు యాత్రను జయప్రదం చెయ్యాలని కోరుతూ శుక్రవారం నాడు ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు,నగర అధ్యక్షులు మల్లాది విష్ణు,నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ* శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మేమంతా సిద్ధం యాత్ర విజయవాడ నగరానికి రాబోతోందన్నారు.విజయవాడ ఈస్ట్ ,సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా యాత్ర జరగబోతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ ర్యాలీలా సిద్ధంయాత్ర సాగుతోందన్నారు. బస్సు యాత్రను పార్టీ శ్రేణులు ప్రజలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. గతంలో ఎవరూ చేయలేనంత సంక్షేమాన్ని జగన్ మోహన్ రెడ్డి చేశారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సంక్షేమ సారధి వస్తున్నాడు ప్రజల స్వాగతం పలకాలి అని తెలిపారు.ఎమ్మెల్యే, మల్లాది విష్ణు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి యాత్ర సెంట్రల్ నియోజకవర్గం మీదుగా సాగుతుందన్నారు. 2019 ఎన్నికల ముందు సెంట్రల్ నియోజకవర్గం మీదుహానే పాదయాత్ర చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో రెండువేల కోట్ల సంక్షేమం, అభివృద్ధి అందించామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. రాబోయే ఐదేళ్లలో మంచి పరిపాలన ఉండాలంటే జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు.
డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ జగనన్న కులమతాలకు అతీతంగా సంక్షేమం అందించారన్నారు. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం యాత్రను అంతా దిగ్విజయం చేయాలన్నారు.పులివెందుల పులి సెంట్రల్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి చేర్మెన్ కర్నాటి రాంబాబు,మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ,బలిజేపల్లి అరుణ్ కుమార్,మేడా రమేష్ తదితరులు పాల్గొన్నారు.