అభివృద్ధి, సంక్షేమ పాలనకు మద్దతునివ్వండి
సారవకోట మండలం పెద్ద లంబ, గోవర్ధన పురం పంచాయతీల్లో నరసన్నపేట వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారం
సంక్షేమ..అభివృద్ధి పాలనకు ఓటు వేయండి
జలుమూరు మండలంలో ముమ్మరంగా వైసీపీ ఎన్నికల ప్రచారం
సారవకోట నుంచి ప్రత్యేక ప్రతినిధి : మేలు చేసిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మళ్లీ జగనన్న సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం సారవకోట మండలం పెద్ద లంబ, గోవర్ధన పురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ముందు దొంగ హామీలతో మీ ముందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని హితువు పలికారు. మీ కుటుంబానికి మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు మద్దతు తెలపాలని కోరారు. ప్యాన్ గుర్తు పై ఓటు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అలాగే ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను ఆశీర్వదించాలని వీరు కోరారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రజలు నుండి విశేష స్పందన లభించింది. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, వరుదు దేవీప్రసాద్, పిఎసిఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు, వైస్ చైర్మన్ బొంగు కొండయ్య, వైస్ ఎంపీపీ గుణుపురం రామారావు , అసిరయ్య, సర్పంచ్ షన్ముఖరావు సర్పంచులు ఎంపీటీసీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సంక్షేమ..అభివృద్ధి పాలనకు ఓటు వేయండి : ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పాలనకు ఓటు వేయాలని రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ లు పిలుపునిచ్చారు. గురువారం జలుమూరు మండలం జోనంకి, దరివాడ పంచాయతీలలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం విడిచి పారిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవీ దాహంతో ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చి అబద్ధపు మాటలు చెప్పి అధికారం రాబట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి మాటలు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులో లేరని వీరన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేపట్టినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. అడుగడుగునా కుంకుమ తిలకాలు అద్ది పూలదండలు, కర్పూర హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ వైస్ ఎంపీపీ తంగి మురళీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, పిఎ సిఎస్ అధ్యక్షులు మొజ్జాడ శ్యామలరావు పాగోటి రాజప్పలనాయుడు ఏఎంసీ చైర్మన్ పెరుమళ్ళ తవిటి నాయుడు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పైడి విటల్ రావు, జె సి ఎస్ కన్వీనర్ ధర్మాన జగన్ , దాము మన్మధరావు వెలమల అసిరినాయుడుతోపాటు స్థానిక సర్పంచ్, జిల్లా మహిళా విభాగం కార్యదర్శి గురువిల్లి రమణి, ఎంపీటీసీ పొన్నాన విజయ్ కుమార్, సర్పంచులు ఎంపీటీసీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.