64వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి, కేశినేని నాని
పాల్గొన్న మల్లాది విష్ణు, సర్నాల తిరుపతిరావు
విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు,ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గురువారం నియోజక వర్గంలో స్థానిక 64వ డివిజన్ కుందా వారి కండ్రిక తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ, శ్రీరాములు, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడితూ డివిజన్ పర్యటనలో భాగంగా 64వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైస్సార్సీపీ హయాంలో డివిజన్ డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లడం జరిగిందన్నారు. కేశినేని నాని మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని, వైస్సార్సీపీ అభ్యర్థులు గెలిపించాడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.