ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ సెంట్రల్ బ్యూరో ప్రతినిధి : సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గల పలు మసీదుల వద్ద పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రార్దనలు చేసి అనంతరం మైనారిటీ సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు. నగర పాలక సంస్థ వారి తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. సోదర భావానికి ప్రతీక రంజాన్ అని తెలిపారు. అల్లా ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ఉండాలని ప్రార్థించారు. నాడు మైనారిటీలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీలకు చేరువ అయితే. నేడు మనందరి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, ముస్లిం మైనారిటీ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.