విశాఖపట్నం : జర్నలిస్టులపై గురుతర బాధ్యత ఉందని, అది విస్మరించకుంటే సమాజానికి మేలు చేకూరుతుందని ఏపీ మీడియా అకాడమీ సెక్రెటరీ ఎం. మణిరాం పేర్కొన్నారు. పెన్ జర్నలిస్ట్స్ సంఘం విశాఖపట్నం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన భవన్ లో ఆదివారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగనబోయిన నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉగాది ఉత్సవాల వేడుకలో మీడియా అకాడమీ కార్యదర్శి మణిరాం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . మీడియా రంగంలో విశేష సేవలు అందించిన పలువురు పాత్రికేయులను వారి చేతుల మీద ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మీడియాది కీలకపాత్ర అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికు పాత్రికేయులు వారధిగా నిలిచి జనహితంకై నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. జర్నలిస్ట్స్ సంఘాలు పాత్రికేయుల సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు ప్రదానం చేసి గౌరవించడం సంతోషదాయకమన్నారు. పెన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంఘం విశేష కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టులకు ఎల్లవేళలా అన్ని విధాలా అండగా నిలుస్తుంది అన్నారు. పెన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు వొమ్మి కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం. లోకేష్ కుమార్, కోశాధికారి గుండు రాజు , పెన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎంవీఎస్ జీ తిలక్ ఈ వేడుకల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉగాది సంబరాలలో పలువురు సీనియర్ జర్నలిస్టులను, వివిధ రంగాల్లో నిష్ణాతులను
సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్ యు జె ఐ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె.వి.వి. సత్యనారాయణ, శ్రీకాకుళం పాత్రికేయులు జేఏసీ చైర్మన్ ఎస్ జోగి నాయుడు విజయనగరం సాక్షి కరస్పాండెంట్ యుగంధర్ విశాఖపట్నం సాక్షి సీనియర్ రిపోర్టర్ ఆర్. రామచంద్రరావు, డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్, బద్దం సుమలత, మట్టా ప్రభాస్ కుమార్, ఆచమల్లు ఈశ్వర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ బ్యూరో చీఫ్ జి జనార్దన రావు, సీనియర్ పాత్రికేయులు బి.ఎస్ చంద్రశేఖర్, పీఏఆర్ పాత్రుడు, బంగారి అశోక్ కుమార్, మన భూమి సత్యనారాయణ, చంద్రమోహన్ తదితరులను సత్కరించారు. సమాజ సేవకులు సతివాడ శ్రీకాంత్ అక్కిరెడ్డి వరలక్ష్మి తదితరులను ఉగాది పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాత్రికేయులు హాజరయ్యారు.