ఇలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది
ప్యాన్ గుర్తు పై ఓటు వేసి జగనన్న సంక్షేమ పాలనకు మద్దతు పలకండి
పోలాకి మండలం రాళ్ళపాడు, ముప్పిడి గ్రామాల్లో ప్రచారం చేపట్టిన వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణ దాస్
పోలాకి బ్యూరో ప్రతినిధి:
జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి నభూతో నభవిష్యతి అని, స్వర్ణయుగం లాంటి
చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవ్వరూ లేరని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శనివారం ఉదయం పోలాకి మండలం రాళ్ళపాడు, ముప్పిడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. పేదవాడి అభ్యున్నతికి, మహిళా సాధికారతకు పాటుపడిన ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలందరూ కాపాడుకోవాలన్నారు. మళ్లీ సంక్షేమ రాజ్యం కావాలంటే జగన్ అన్న పాలన రావాలని,
ప్రజలందరూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జగనన్నకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్, నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం చేపట్టారు… ప్రజలు అపూర్వ స్వాగతం పలికి… కుంకుమ తిలకాలు కర్పూర హారతులతో అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, కళింగ కోమటి కార్పోరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పెద్దలు పాగోటి అప్పారావు పార్టీ అధ్యక్షులు కణతి కృష్ణారావు, జేసీఎస్ కన్వీనర్ కణితి సత్తిబాబు, వైస్ ఎంపీపీ తోట అప్పారావు, కలగదండు తాతారావు, యువజన విభాగం అధ్యక్షుడు రెంటి కోట త్రినాధరావు, చింతు రాఘవరావు, స్థానిక సర్పంచ్ బోర సోమేశ్వరరావు, బోర అప్పలరాజు , . భావన వైకుంఠ రావు, మెండ రామకృష్ణ, రావాడ అప్పలరాజు, సర్పంచులు ఎంపీటీసీలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు