నెల్లూరు, బ్యూరో ప్రతినిధి నెల్లూరు నగరంలోని 43 వ వార్డు, జెండా వీధిలో నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి సతీమణి సునంద విజయసాయి రెడ్డి పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్ది ఖలీల్ అహ్మద్ సతీమణి హసీనతో కలిసి గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి, ప్రతి షాప్ కి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి వివరించారు. కరపత్రాలు అందజేస్తే ఎంపీగా విజయసాయి రెడ్డిని, ఎమ్యెల్యే గా ఖలీల్ అహ్మద్ ని గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీని గెలిపించడం ద్వారా నెల్లూరు అభివృద్ధికి బాటలు వేసినట్లవుతుందని అన్నారు. నెల్లూరు గ్రీన్ సిటీగా, సుందరమైన నగరంగా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీ విజయసాయి రెడ్డి తప్పక నెరవేరుస్తారని అన్నారు. మరింత మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమత్రిని చేసుకోవాలని కోరారు. ప్రజలు తమ ఓటుతో ఆశీర్వదించి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలిపించాలని కోరారు. అడుగుపెట్టిన ప్రతి ఇంటి నుంచి మంచి స్పందన లభించింది. సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్సీపీ కే తమ మద్దతు అని స్పష్టం చేశారు. ప్రచారంలో పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరి, మహిళలు పాల్గొన్నారు.