డబ్బులు లేవంటూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు
సచివాలయ వ్యవస్ద ఉపయోగం నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తెలిసివచ్చింది
వాలంటీర్ వ్యవస్ధపై నిమ్మగడ్డ రమేష్ తో ఫిర్యాదు చేయించారు.
చంద్రబాబు చేసిన నిర్వాహకం వల్ల పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులకు కష్టాలు
చంద్రబాబు అరాచకాలు, కుట్రలు మరోసారి ప్రజలకు అవగతమైంది
ఐఏఎస్,ఐపిఎస్ అధికారుల్ని డీమోరల్ చేయడానికే పురందేశ్వరి ఈసికి ఫిర్యాదులు
మీడియాతో వైయస్సార్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
గుంటూరు, ప్రధాన ప్రతినిధి : వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సచివాలయ వ్యవస్ద ఉపయోగం నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తెలిసివచ్చిందన్నారు. సీఎం జగన్ మానసపుత్రిక అయిన సచివాలయ వ్యవస్ధ ఉద్యోగులతో పెన్సన్ ల పంపిణి చేయచ్చని నేడు వారే చెబుతున్నారు. జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదని గత నాలుగేళ్ళుగా విమర్శలు గుప్పించిన వాళ్ళే 1.30 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో పెన్సన్ లు పంచవచ్చని అంటున్నారని సజ్జల మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వాలంటీర్ల ద్వారాపెన్సన్ పంపిణి జరగకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు పై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఆ వ్యవస్ధ ద్వారా సంక్షేమ పధకాలు ప్రతి గడపకు అందించారు.అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరిత్యాలప్పుడుగాని,కోవిడ్ లాంటి విపత్కర పరిస్దితులలోగాని నేరుగా ప్రభుత్వానికి సమాచారం అందించేందుకు ఒక లింక్ ఫామ్ చేశారు.ఉన్నతమైనదేకాక, శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే వ్యవస్ద అది. దానిని నీచమైనగా చూపుతూ వైయస్సార్ సిపి కి మేలు చేసేదిగా ఆ వ్యవస్దను చూపుతూ వచ్చారు. వాలంటీర్లపై చంద్రబాబు కనుక ఫిర్యాదుచేస్తే ప్రజలు ఉమ్మేస్తారు…రాళ్ళేసి కొడతారని భావించి తన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేష్ తో ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయించారన్నారు. పెన్సన్ ల పంపిణి నుంచి వాలంటీర్లను తప్పించాలని లెటర్ పెట్టించిందే చంద్రబాబే అని అదే రీతిలో కోర్టులో వేయించారని వివరించారు.అసలు సిటిజన్స్ ఫర్ డెమక్రసీ అని సంస్దను పెట్టించిందే దీనికోసం అని ఆరోపించారు. వాలంటీర్లు అనే వారి బాధ్యత పెన్సన్ ల పంపిణి.ఇకపై ఆర్టిసి,రెవిన్యూ ఉద్యోగులు,మున్సిపల్ ఉద్యోగాలు ఏ పనిచేయకూడదు. వీరి ఆలోచన అలానే ఉంది. ఏదైనా పధకాల అందించినా ….ఎల్లోమీడియా బ్యాచ్ చర్యలతో పెన్షన్ల కోసం ఈరోజు వృద్ధులు, వికలాంగులకు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. చంద్రబాబు స్వార్ధం తప్ప మరేమి చూసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో చంద్రబాబు స్వార్థం తప్ప మరేమీ చూసుకోలేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. వలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బులు లేవని ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు ఆ మాత్రం తెలియదా?. చంద్రబాబు తీరు చూసి ప్రజలకు ఒక్కసారిగా జన్మభూమి కమిటీల అరాచకాలు గుర్తుకు వచ్చాయి. ప్రజలలో చంద్రబాబుపై తిరుగుబాటు వస్తోంది. ప్రజలు శాపాలు పెడుతున్నారు. తిరిగి చంద్రబాబు వాలంటీర్ల ద్వారా మేం వస్తే 4 వేలు ఇస్తామని చెబుతున్నారు.ఓ వైపు వాలంటీర్లను తిడుతూనే…వాళ్ళు వద్దని అంటూనే వారిని కొనసాగిస్తామని చెప్పడం దుర్మార్గం.సమాజంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిగా గుర్తింపు పొందిన చంద్రబాబు అవసాన దశలో ఉన్న టిడిపి అద్యక్షుడుగా ఉండటం మన దౌర్భాగ్యం అన్నారు. జగన్ గారు వాలంటీర్ల వ్యవస్దను ప్రజలలోకి తీసుకువెళ్లారు.దానివల్ల సత్ఫలితాలు వచ్చాయి.ఇతర రాష్ర్టాల వారు సైతం దానిని మెచ్చుకున్నారు.అలాంటి స్దితిలో చంద్ర బాబు కడుపు మంటతో వాలంటీర్లపై ఈసికి ఫిర్యాదు చేయించి పెన్సన్ ల పంపిణిని వాలంటీర్ల ద్వారా చేయద్దని అడ్డుకున్నారని తెలియచేశారు.రెండు పత్రికలు,మూడు టివి ఛానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు విషం చిమ్ముతున్నారు.ఒకడేమో పండుటాకులపై పగ అని…శవరాజకీయాలు చేస్తున్నామని మరొక పత్రికలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు.వాటినే తీసుకుని చంద్రబాబు జనం రాని బహిరంగసభలలో ఆ మాటే మాట్లాడుతుంటారన్నారు. గతంలో ఒకటో తేదీన వలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు రెండోరోజుకి 60 శాతం పంపిణీ మాత్రమే జరిగింది. పైగా స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని సజ్జల ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారు. ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తోందన్నారు.