రాష్ట్రంలో దిగజారిన రాజకీయాలు
మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది
దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?
చంద్రబాబును హంతకుడు అందామా?
పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడను
తిరుపతి జిల్లా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్రెడ్డి
తిరుపతి నుంచి ప్రధాన ప్రతినిధి : మరో ఐదు వారాల్లో ఎన్నికలనే కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ప్రతి వర్గం మంచి చేసే మనం మోసం చేసే చంద్రబాబు కూటమి తలపడతున్నాం. జగన్‌ను ఓడించాలని వాళ్లు పేదలను గెలిపించాలని మనం. మరో చారిత్రక విజయం దక్కించుకోవడం కోసం సిద్ధమా? అని నాయుడుపేట ప్రజా ప్రభంజనంను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. తిరుపతి జిల్లా పరిధిలో గురువారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. సాయంత్రం నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ‘‘ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్నవి కావు. పేద సామాజిక వర్గ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఈ ఓటు కేవలం ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునేందుకు కాదు. మన తలరాతను, మన భవిష్యత్తులను మనంతట మనమే రాసుకునేందుకని గుర్తు ఉంచుకోండని సీఎం జగన్ గుర్తు చేశారు. నాయుడుపేటలో జన ప్రభంజనం కనిపిస్తోంది. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన లబ్ధికి అడ్డుతలుగుతున్న దుష్ట చతుష్టయం పై యుద్ధం ప్రకటించడానికి వచ్చిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు, అవ్వలు, తాతలు, సోదరుడు స్నేహితులు అందరికీ మీ జగన్..మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు. ఆ దుష్ట చతుష్టయాన్ని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ గర్జించే గొంతుకతో ప్రశ్నించగా సిద్ధం అంటూ అవతలి నుంచి బదులు వచ్చిందన్నారు.
చంద్రబాబును హంతకుడు అనలేమా? : ఈ ఎన్నికలు రెండు భావజాలాలు, పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ. అన్ని వర్గాలకు మనం మంచి చేశాం. 75 శాతం నా అని పిలుచుకునే సామాజిక వర్గాలకు డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో నగదు జమ చేసి లబ్ధి అందించాం. పెన్షన్లను మూడు వేల రూపాయాలకు పెంచుకుంటూ వచ్చాం. ఒకటో తేదీన వలంటీర్ల రూపంలో పెన్షన్లు ఇంటి వద్దకే అందించాం. అలాంటిది తన మనిషితో ఫిర్యాదు చేయించి పెన్షన్ల పంపిణీన్ని అడ్డుకున్నది చంద్రబాబు. పేదలకు ఇళ్ల పట్టాలు అందవద్దని కోర్టులకు వెళ్లారు. పేదల భవిష్యత్తు కొరకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమా? అని అడుగుతున్నా అని సీఎం జగన్ మరోసారి ప్రశ్నించారు.
రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. చెడిపోయాయి. ఏ స్థాయికి అంటే అవ్వాతాతలకు ఇంటి వద్ద ఇచ్చే పెన్షన్లను తాము చెబితేనే చంద్రబాబునాయుడు ఆపించారని అహంకార ధోరణితో వాళ్ల పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు(రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేరు ప్రస్తావన) చెప్పారు. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో చూస్తున్నాం. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వా, తాతలు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబును హంతకుడు అందాం. అంతకంటే దారుణంగా చెబుదామా?. వలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు అందుకుంటున్నారు. జూన్ 4వరకు ఓపిక పట్టండి. మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది. తొలి సంతకం వలంటీర్ వ్యవస్థపైనే చేసి పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తెలుసా చంద్రబాబు..తెలుసా యెల్లో ముఠా..మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా?. జగన్‌కు నా తోబుట్టువులుగా భావించే అక్కచెల్లెమ్మలు ఉన్నారు. నన్ను మనసారా ఆశీర్వదించే పేద అవ్వాతాతలు ఉన్నారు. నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు ఉన్నారని గర్వంగా చెబుతాడు ఈ జగన్. వీళ్లంతా నా వాళ్లు. వీళ్ల భవిష్యత్తు మార్చడం కోసం 58 నెలలుగా అడుగులు పడ్డాయని గర్వంగా ఈ విషయం చెబుతున్నానన్నారు.
చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడను : చంద్రబాబు ఒక మాట అడుగుతున్నా : అయ్యా చంద్రబాబు నువ్వు 14 ఏళ్లు, మూడుసార్లు సీఎం అని చెబుతావ్ కదా. మరి అన్నేళ్లు చేశానని చెప్పుకుంటూ నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచిగానీ, సంక్షేమ పథకం ఎవరికైనా గుర్తొస్తుందా?. పైగా చంద్రబాబుకి గుర్తొచ్చేది వెన్నుపోటని సింబాలిక్‌గా సైగతో చూపించారు సీఎం జగన్. మనకు కోట్ల మంది అభిమానం ఉంటే ఆ ముఠాకు పొరుగు రాష్ట్రం నుంచి అభిమానులు ఉన్నారు. గత 58 నెలల్లో మీ బిడ్డ వేసిన అభివృద్ధి, సంక్షేమ విత్తనాలు రాబోయే రోజుల్లో చూస్తారు. ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టే వాళ్ల(చంద్రబాబు అండ్ కో) మాదిరి పొత్తులు, కుట్రలు, ఎత్తులు, జిత్తులతో పని లేదు. మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఓటేయమని అడిగేందుకు మీ ముందుకు రాగలిగాను. కాబట్టే మీ జగన్ ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనషుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ఆశీస్సులు కోరుతున్నాడు. రాబోయే ఎన్నికల కోసం కూడా అబద్ధాలు చెప్పడు. సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు. చంద్రబాబులా కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలనుకోవడం లేదు. పేదలపై ఈ జగన్‌కు ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి ఉండదు. మీ బిడ్డ మాట ఇస్తే తప్పేదే లేదు. గుర్తు పెట్టుకోండని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే కొనసాగిస్తున్న పథకాలు కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగే అవకాశం ఉంటే తప్పక చేస్తాం. ఈ 58 నెలల పాలనలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో మేనిఫెస్టోలో చేయగలిగిన మంచి అంతా చేస్తానని మీకు తెలియజేస్తున్నా. మరి మరోసారి బాబును నమ్మొచ్చా? అని ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.