మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ మతీన్ పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయన 1999 నుండి కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ గా, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ గా, రెండు పర్యాయాలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా, పెడన నియోజకవర్గ పరిశీలకునిగా ఆయన సేవలందించారు. మతీన్ అభ్యర్థిత్వం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.