గుడివాడ : గుడివాడ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్డాది గోవిందయ్య పోటీ చేయనున్నారు. మంగళవారం ప్రకటించిన జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం గోవిందయ్య పేరును ప్రకటించింది. వడ్డాది రాజేష్ గా పిలవబడే గోవిందయ్య గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా అనేక బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. పట్టణ ప్రజలకు సుపరిచితుడైన రాజేష్, వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 ఏళ్లుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు