విజయవాడ పార్లమెంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)
విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గం, 15వ డివిజన్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో గాంధీ కాలనీ నుండి జరిగిన డివిజన్ పర్యటనలో విజయవాడ పార్లమెంటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,దేవినేని అవినాష్
పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ లక్షన్నర మంది పేదవాళ్ళ నివసిస్తున్న తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో వరద ముంపు నుంచి రక్షణ కోసం సీఎం జగన్ సహకారంతో, దేవినేని అవినాష్ చొరవతో రూ.500 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మించి భద్రత కల్పించడం జరిగిందన్నారు. దేవినేని అవినాష్ ఎమ్మెల్యే కాకుండానే తూర్పు నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా ఇంకెంత అభివృద్ధి చేస్తారని నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. పేదవాళ్లంటే చంద్రబాబు నాయుడు కి ఎంత చులకనో సింగనమల డ్రైవర్ పై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తెలుగు వారి ఆత్మగౌరం కోసం పేదవాళ్ళ కోసం కర్షకులు కార్మికుల కోసం రైతాంగం కోసం పెట్టిన పార్టీ సిద్ధాంతాలను సప్త సముద్రాలలో ముంచేసి దళితుల కోసం మాత్రమే పాటుపడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. పేదలకు రాజ్యాధికారం ఉండకూడదని , వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేల కాకూడదు కేవలం ధనికులు మాత్రమే ఎంపీలు అయ్యే అర్హత ఉందని ప్రవర్తించే తీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు స్కీమ్ క్యాష్ కొట్టు – టికెట్ పట్టు
అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ఈ లారీ డ్రైవర్లే దేశమంతట వారి లారీలకి జెండా కట్టుకొని తిరిగి పనిచేసారన్నారు. పేదల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ టిడిపి అన్నారు. 2 లక్షల 70 వేల కోట్లు ప్రజల సంక్షేమం కోసం జగన్ ఇచ్చారంటే అదొక రికార్డు. 2014లో టిడిపి బిజెపి జనసేన కలిసి 650 పేజీల హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కారన్నారు ఆరోజు మోడీ రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని ఎంపీగా నాతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మరి ఈరోజు ఏ ప్రత్యేక హోదా ఇచ్చారనా,రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారని, రైల్వే జోన్ ఇచ్చారనా, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారనా,ఏ హామీ ఇచ్చారని వారితో మళ్లీ పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, తన కొడుకు లోకేష్ కోసం, వారి కేసుల నుంచి భయపడడం కోసం, వారు చేసిన తప్పుడు పనులు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని, తూర్పు నియోజకవర్గం 20-25 వేల మెజారిటీతో ప్రజలు గెలిపించడం ఖాయం అన్నారు.
జనసేన పార్టీకి నమ్మకంగా, 10సంవత్సరాలు సేవ చేసిన పోతిన మహేష్ సీటును బిజెపికి అమ్మేసి నట్టేట ముంచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 39వేల ఉద్యోగాలు ఇస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ధనికులు బాగుండాలంటే బాబు కావాలేమో – పేదవారు, మధ్య తరగతి వారు సుఖసంతోషాలతో ఉండాలంటే జగన్ మళ్లీ సీఎం అవ్వాలి. ఈ పర్యటనలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్ నడికుడితి సుబ్బరాజు, ఊకోటి శేషగిరిరావు, కాటూరి మోహన్ రావు, బలరామిరెడ్డి, డాక్టర్ ఎం ఎన్ రాజు, రంగబాబు , యనమద్ది నాగమల్లేశ్వరరావు , షేక్ అమానుల్ల , వెలగలేటి భార్గవ్ రాయుడు,గోరంట్ల శ్రీనివాసరావు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇంచార్జిలు,అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల ఇంచార్జిలు, క్లస్టర్ ఇంచార్జిలు, గృహ సారధులు, కన్వీనర్లు, సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.