ప్రజా సమస్యల పరిష్కారానికే నా మొదటి ప్రాధాన్యత * ఉదయగిరిని అభివృద్ధి పథాన నడిపిస్తా * రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఉదయగిరిలో నమోదు కావాలి * ప్రతిపక్ష అభ్యర్దులు ఎన్ఆర్ఐలు,, విదేశాల్లో వ్యాపారాలు చేసే వ్యక్తులు * ఎన్నికల ప్రచారంలో ఎంపీ విజయసాయి రెడ్డి
ఉదయగిరి : ప్రజాసమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తానని, రాజకీయాలు తప్ప వేరే వ్యాపకాలు తనకేమీ లేవని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి. విజయసాయి రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం జమ్మలపాలెం లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పర్వతనేని శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తాను నెల్లూరులో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఢిల్లీలో పార్లమెంటుకు, కాబోయే రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖపట్నం కి వెళ్లినపుడు నెల్లూరులోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఫోన్ ద్వారా ప్రజలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ఒక ఎన్ఆర్ఐ అలాగే మరో అభ్యర్దికి ఆఫ్రికాలో, ఇండోనేషియా, దుబాయ్ లో వ్యాపారాలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో తేదేపా అభ్యర్దులుగా ప్రకటించిన వారు ఎన్ని రోజులు ఇండియాలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అటువంటి వారిని ఎన్నుకుంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలరో ఓటర్లు ఆలోచించాలని కోరారు. తాము ఎన్ఆర్ఐలు కామని, విదేశాల్లో వ్యాపారాలు లేవని, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పనిచేసే ఫుల్ టైం రాజకీయవేత్తలమని అన్నారు.
1983లో మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయంలో ప్రవేశించారని 45 సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా ప్రజాసేవలో మేకపాటి కుటుంబం ఉందని అన్నారు. గౌతం రెడ్డి భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన ఉదయగిరికి చేసిన సేవలతో ఇక్కడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉండే మేకపాటి కుటుంబానికి నియోజకవర్గ ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని, ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. అభివృద్దిపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు ఒక్క నెల్లూరులోనే రెండు పోర్టులు ఉన్నాయని గ్రహించాలని, రామాయపట్నం పోర్టు జగన్ ప్రభుత్వంలో రికార్డు సమయంలో నిర్మించబడిందని గ్రహించాలని అన్నారు. అభివృద్ధి జగనలేదన్న ప్రతిపక్షాలు నోళ్లు సమాధానంలో మూయించాలని కోరారు. సోమశిల ప్రాజక్టుకు సంబందించి పూడికతీత పనులు ప్రారంభమయ్యాయని. అక్కడి నుంచి నీటిని చెరువుల్లోకి తీసుకొచ్చి జలదంకి సాగునీటి, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరిపోతాయని అన్నారు. ఉదయగిరిలో రోడ్లు అభివృద్ధి చేసి చేపిస్తామని. రోడ్లు విస్తరణ, రోడ్లు మరమ్మత్తులు చేపడతామని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు చదును చేసిన దానికి బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని. దాన్ని ఎన్నికల కోడ్ అనంతరం క్లియర్ చేస్తామని అన్నారు. అలాగే ఉదయగిరి నియోజక వర్గానికి చెందిన సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డితో కలిసి అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి, సంక్షేమ పాలన అందించిన దేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిఫలం అందించాల్సిన సమయం ఆసన్నమయిందని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఓటుతో ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో వైఎస్సార్సీపీ అభ్యర్దులను ఉదయగిరి ప్రజలు గెలిపించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలు ప్రతి గడపకీ గుర్తు చేయడం ద్వారా ప్రజలు వైఎస్సార్సీపీకి తప్పక ఓటు వేస్తారని అన్నారు. రాష్ట్రంలో వై నాట్ 175 అన్నది పార్టీ లక్ష్యమని, అది నినాదం కాదని, ప్రజల సహకారంతో లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు ఏదో ఒక రూపంలో వివిధ పథకాల కింద లబ్దిపొందాయని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్దిగా తననూ, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్దిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, మీలో ఒకడిగా ఉంటానని, ప్రజాశేయస్సే తన శ్రేయస్సుగా పని చేస్తానని ప్రమాణం చేసి చెబుతున్నానని విజయసాయి రెడ్డి అన్నారు.
ఉదయగిరిలో వైఎస్సార్సీపీకి 40 వేల మెజారిటీ : అంతకు ముందు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులకు 40వేల మెజారిటీ కానుకగా అందించాలని ఈ మేరకు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లోనూ లబ్దిదారులు ఉన్నారని, లక్ష నుంచి 5 లక్షల వరకు ఏదో ఒక పథకం కింద లబ్ది పొంది ఉన్నారని వారంతా జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేయాలని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. తాను గడప గడపకూ కార్యక్రమంలో ప్రతి ఇంటి గడప లో అడుగుపెట్టానని ప్రజలందరి అభిప్రాయాలు తెలుసుకున్నానని అన్నారు. సుపరిపాలనతో చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు మనకు కల్గిందని అన్నారు. అలాగే జలదంకి ప్రాంతానికి సాగునీటి కష్టాలకు ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంతో తీర్చగలిగాలనని అన్నారు. అలాగే ఉదయగిరి నియోజక వర్గాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దశరథ రాంరెడ్డి, కార్యకర్తలు, నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.