మరోసారి జగన్ ని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం
రాష్ర్టంలోని ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబం జగన్ కి రుణపడి ఉంటుంది
విశ్వబ్రాహ్మణసంఘ రాష్ర్ట నేతలు
పెత్తందార్లకు పేదలకు జరిగే యుధ్దంలో పేదల పక్షాన పోరాటం చేస్తున్న యోధుడు వైయస్ జగన్
అందుకే బిసి,ఎస్సి,ఎస్తి,మైనారిటీలంతా జగన్ గారి పక్షాన ఉన్నారు
పెత్తందార్లంతా చంద్రబాబు పక్షాన చేరుతున్నారు.లావు కృష్ణదేవరాయలు,వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి,వసంత్ కృష్ణప్రసాద్ లే ఇందుకు ఉదాహరణ
అంతిమ విజయం పేదలదే.అంటే జగన్ దే
రానున్న ఎన్నికలలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం.
విశ్వబ్రాహ్మణ ఆత్మీయసమావేశంలో శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి
అమరావతి : బిసిల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని శాసనమండలిలో విప్ లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. బిసిలను మరోసారి మభ్యపుచ్చేందుకు బిసి డిక్లరేషన్ అంటూ కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని తెలియచేశారు.శ్రీ వైయస్ జగన్ గారు బిసిలకు టిక్కెట్లు ఇద్దామని ప్రయత్నిస్తుంటే వైయస్సార్ సిపిలోని పలువురు నేతలను చంద్రబాబు అక్కున చేర్చుకుని బిసిలకు వ్యతిరేకంగా వారిని ఆదరిస్తున్నారని ఆరోపించారు.
విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయసమావేశం తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో జరిగింది.సమావేశానికి విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి పవిత్రమురళీ కృష్ణ అధ్యక్షత వహించారు.
ఈ సందర్బంగా శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్ గారు పేదల జీవితాలలో మార్పులు తెచ్చేందుకు అనేక సంస్కరణలు తెచ్చారు. అనేక పధకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా బిసిల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణ సమాజానికి సంబంధించి ఎన్నో ప్రోత్సహకాలు ఇచ్చారు.బిసిలకు రాజకీయపరమైన భాగస్వామ్యం ఉంటే వారే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవచ్చనేది జగన్ గారి భావన. విశ్వబ్రాహ్మణ సంఘీయులకు శాసనమండలిలో స్దానం కల్పించాలని కూడా జగన్ గారు నిర్ణయించారని స్పష్టం చేశారు.175 స్దానాలలో వైయస్సార్ సిపిని గెలిపించాలనే దిశగా జగన్ గారు ముందుకు వెళ్తున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలనేది ఆయన లక్ష్యం అన్నారు.ఇందులో బాగంగా విద్య,వైద్యం అంశాలలో అనేక వేల కోట్ల రూపాయలతో నాడు-నేడు ద్వారా పనులు చేపట్టారు.31 లక్షల మందికి ఇంటి స్దలాలు ఇచ్చారు.వైయస్ రాజశేఖరరెడ్డి బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారు.నా వల్ల మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నారు.చంద్రబాబు ప్రజలను మోసం చేసి నిత్యం జగన్ గారిపై దుమ్మెత్తి పోస్తున్నారు.ఇతర పార్టీలతో కలసి విమర్శలు చేస్తున్నారు.అభద్దాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.షర్మిల గారి ద్వారా నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు.వాటిని ప్రజలు నమ్మే పరిస్దితి లేదన్నారు.
పేదలకు పెత్తందార్లకు జరిగే యుధ్దంలో పేదలను గెలిపించి వైయస్సార్ సిపిని అధికారంలోకి తేవాలన్నారు.కృష్ణాజిల్లాలో మైలవరం లో గతంనుంచి కూడా కమ్మ సామాజిక వర్గం నేతలు రెండు పార్టీల తరపున పోటీ చేస్తున్నారు.అక్కడ తిరుపతయ్య యాదవ్ కు జగన్ గారు ఎంఎల్ ఏ టిక్కెట్టు ఇచ్చారు.అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీ ఆసిఫ్ కు ఇఛ్చారు.అదే విధంగా మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి స్దానంలో మురుగుడు లావణ్య అనే బిసి అభ్యర్దిని పోటీకి నిలిపారు.
అదే విధంగా నెల్లూరు లో ఖలీల్ అనే మైనారిటీ అభ్యర్దికి టిక్కెట్టు ఇచ్చినందుకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అలిగితే ఆయనను చంద్రబాబు పిలిచి టిక్కెట్టు ఇచ్చారు.అదే విధంగా నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయల స్దానంలో అనిల్ కుమార్ యాదవ్ కు టిక్కెట్టు ఇచ్చారు.ఆయనను సైతం చంద్రబాబు పిలిచి టిక్కెట్టు ఇచ్చారు.అంటే బిసిలను మైనారీటీలను నాయకులుగా తీర్చిదిద్దాలని జగన్ గారు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు ఏ విధంగా అడ్డుకుంటున్నారో వీటిని గమనిస్తే అర్ధమవుతుంది.పైగా అలాంటి చంద్రబాబు,పవన్ కల్యాణ్ తో కలసి బిసి డిక్లరేషన్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.బిసిలంతా ఒక్కటే ఆలోచించండి బిసిలను ప్రోత్సహిస్తుంది జగన్ మాత్రమే అనే అంశాన్ని గుర్తించాలని కోరారు.
పలువురు విశ్వబ్రాహ్మణ సంఘీయులు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ గారు తమ సంఘీయులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. విశ్వబ్రాహ్మణులంతా శ్రీ వైయస్ జగన్ గారికి అండగా ఉంటామన్నారు. మరోసారి జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని స్పష్టం చేశారు.- రాష్ర్టంలోని ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబం జగన్ గారికి రుణపడిఉంటుంది
సమావేశంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ర్ట అధ్యక్షులు చేవూరి రామస్వామి,దావులూరి హనుమంతరావు, ,డైరక్టర్లు జి.రజని,సుబ్రమణ్యం,శ్రీనివాసులు,గోపి, పలమనేరు మున్సిపల్ కౌన్సిలర్ మురశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.