వెలగపూడి : ఇంటర్నేషనల్ బాకలరియేట్ బోర్డు ప్రతినిధులు మంగళవారం పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ని సెక్రటేరియేట్ లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఐబీ బృందాల పర్యటన సారాంశం, భవిష్యత్తు ప్రణాళిక, అమలు విధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి , ఐబీ ప్రతినిధులు జెన్, ఎలెన్, జేమ్స్ , ఎస్సీఈఆర్టీ ప్రతినిధి సుధాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.