– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా బిసిలను మోసం చేసి నేడు ఏదో ఉద్దరిస్తానంటూ బిసి డిక్లరేషన్ అంటున్నాడు.
– కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలకు హామీలను ఇస్తున్నారు..
– బీసీ,ఎస్సి,ఎస్టీ, మైనార్టీల సాధికారత ఇవ్వడమే కాక ఆయా కులాలకు జగన్ ఒక స్వరూపం ఇచ్చారు..
– జగన్ గారు వెనుకబడిన వర్గాలకు 70శాతం,కేవలం బీసీలకు మాత్రమే చూస్తే 40శాతం పదవులు ఇచ్చారు.
– అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు సైతం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
– ఈ విధంగా ఒక సంస్కర్త మాత్రమే చేయగలరు. అదీ జగన్ ఒక రెఫార్మర్ గా ఆలోచనలు చేశారు
– 50 శాతం పదవులు,నామినేటెడ్ పనులలో చట్టం సైతం తెచ్చారు.జగన్ కి ఉన్న నిబద్ధత మరొకరు కి లేదు..
– బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్ కూడా అదే అలోచన చేస్తున్నారు..
– నాయకులు అలోచన దృక్పథం, గట్టి పోరాట స్ఫూర్తి తో ముందుకు రావాలి..
– 2014… 2019 మధ్య చంద్రబాబు దోపిడీ,అక్రమాలు,అరాచకాలకు పాల్పడ్డారు.
– జన్మభూమి కమిటీ ల పేరుతో మాఫియా గ్యాంగ్ ని చంద్రబాబు రెడీ చేశారు..
– పోలవరం ప్రాజెక్టు….అమరావతి భూములు…చివరకు లేని మరుగుదొడ్లు ఉన్నట్లు చూపి అక్రమాలకు పాల్పడ్డారు
– చంద్రబాబు దోపిడీ,అక్రమాలు చూసే ప్రజలు 2019లో చెత్తబుట్టలో వేశారు.
– జగన్ చేసినవన్ని తానే చేసినట్లు గా ప్రచారం చేస్తూ బరితెగించేలా ప్రవర్తిస్తున్నారు
– గుమ్మనూరు జయరాం రాజీనామా చేస్తే ఆయనకు టీడీపీ మద్దతు ఇస్తుంది
– మంత్రిగా ఉండగా చంద్రబాబు అనుకూల మీడియా లో జయరాం అక్రమాలు అంటూ ప్రచారం చేశారు.
– వాలంటీర్ల వల్ల ప్రజలకు మంచి సేవలందుతున్నాయని గర్వంగా చెప్పగలం
– మీ హయాంలో దోపీడీలు చేసిన జన్మభూమి కమిటీ లు మళ్ళీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా
– జగన్ గారిపై రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ… గొడ్డలి పోటు అంటూ విషప్రచారం చేస్తున్నారు..
– పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడు తో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరు శ్రీ వైయస్ జగన్ గారిపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు.
– వాటిని నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు.
– చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు.
వడ్డెర్ల ఆత్మీయసమావేశంలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి.
14 సంవత్సరాలు ముఖమంత్రిగా పనిచేేేేేేేేేేేేేేేేేేేేేసినప్పుడు బిసిలను అడుగడునా మోసం చేసిన చంద్రబాబుకు బిసిల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించమని వెళ్తే తోకలు కత్తిరిస్తానని అవమానాల పాలు చేసిన చంద్రబాబు నేడు బిసిల ఓట్ల కోసం దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బిసిలు అన్ని రంగాలలో అభివృధ్ది చెందాలంటూ వారికోసం నిరంతరం తపిస్తూ వారిలో నాయకత్వలక్షణాలను ప్రోత్సహిస్తున్న శ్రీ వైయస్ జగన్ అండగా రాష్ర్టంలోని బిసిలంతా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటలను నమ్మేస్దితిలో బిసిలు లేరని అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర్ల ఆత్మీయసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి వడ్డెర్ల కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీమతి దేవళ్ళ రేవతి అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎంఎల్సిలు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి,చంద్రగిరి ఏసురత్నంలతో పాటు పలువురు వడ్డెర్ల కులసంఘ నేతలు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్బంగా శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే ఆయన మాటల్లోనే ………
తెలుగుదేశం పార్టీ దుస్సాహసానికి ఒడిగడుతోంది.ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లో,కమ్యూనిస్టు పార్టీ లాంటివాళ్లో బిసి డిక్లరేషన్ పెట్టారంటే అర్ధముంటుంది. మూడు సార్లు అదికారంలోకి వచ్చినా 14 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చినా ప్రతిసారి చంద్రబాబు బిసిలను మోసం చేస్తూనే ఉన్నారు. ఆదరణ అంటూ పనిముట్లు ఇచ్చి వారిని కులవృత్తులకే పరిమితం చేశారు.అందులో కూడా స్కామ్ లకు పాల్పడ్డారు. బిసిల సామాజిక,రాజకీయ,ఆర్దిక సాధికారిత కోసం సీరియస్ గా ఏమాత్రం చంద్రబాబు ఆలోచించలేదు. చంద్రబాబు కేవలం అక్రమ సంపాదన కోసమే పరిపాలన సాగించారు. వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రం బిసిల అభ్యున్నతికి నిరంతరం తపించారు. సమాజంలో మార్పుకోసం విద్య,వైద్యం,వ్యవసాయం రంగాలలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అట్టడుగు వర్గాలకు సాధికారిత తీసుకురావాలని ప్రణాళికా బద్దంగా కృషి చేసి చూపించారు. ముఖ్యంగా ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా బిసి కుటుంబాలలో విద్యావంతులను తయారుచేసి వారి కుటుంబాలలో అభివృద్ది తీసుకువచ్చారు.వైద్యరంగంలో ఖరీదైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించి ఆర్దికంగా అండదండగా నిలబడ్డారు.అందుకే ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతున్నా కూడా కోట్లాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేశారు. జాతీయనేతలతో పోల్చుకున్నా కూడా వైయస్ కు వారెవ్వరికీ లేనివిధంగా పేరు ప్రఖ్యాతలు లభించాయి. నరేంద్రమోది,పవన్ కల్యాణ్ సహకారంతో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అదీకూడా కేవలం 1 శాతం ఓటుతేడాతో అధికారంలోకి వచ్చారు.గతంలో అక్రమాలు,దోపిడీలకు పాల్పడినా కూడా ప్రజలు ఆ విధంగా ఐదు సంవత్సరాలు సేవచేసే అవకాశం కల్పించారు. కాని చంద్రబాబు సరైనవిధంగా పరిపాలించకుండా 2014-19 మధ్య అంతకుముందు కంటే దిగజారి దోపిడీ సాగించారు. పోలవరం దగ్గర్నుంచి అమరావతి వరకు,చివరకు లేని మరుగుదొడ్లతో కూడా దోపిడీ సాగింది. జన్మభూమి కమిటీలను మాఫియా గ్యాంగ్ ల్లాగా తయారుచేశారు. జన్మభూమి కమిటీలనే వ్యవస్ధను టిడిపి ప్రయోజనాలకోసం రూపొందించారు. పెన్సన్లు,మరే లబ్ది కావాలన్నా కూడా ఆ కమిటీల ద్వారా నడిచేవి.లేని మరుగుదొడ్లు,నీారు చెట్టు పధకం ద్వారా ఆ దోపిడీ విపరీతంగా సాగిందన్నారు.
ఆ అక్రమాలు,దోపిడీల నేపధ్యంలో ప్రజలు చంద్రబాబును 2019లో చెత్తబుట్టలో పడేశారు. జగన్ గారు అనేక ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముఖ్యంగా 23 మంది ఎంఎల్ ఏలను చంద్రబాబు లాక్కున్నా కూడా ఆ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు.ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేసారు. ప్రజలతో మమేకమైన జగన్ గారిని ప్రజలు అక్కున చేర్చుకుని 151 స్ధానాలతో తిరుగులేని విధంగా ఘనవిజయాన్ని అందించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేేేేేేేేేేేేేేేేేేసే విధంగా గ్రామసచివాలయాలను వాలంటీర్ల వ్యవస్ధను తీసుకువచ్చారు. వ్యవస్దలనే క్రియేట్ చేశారు.అధికారయంత్రాంగాన్ని కూడా కన్వీన్స్ చేసి పార్టీ పరంగా అన్నిరకాలుగా ప్రజలలో నిలబడాలి,సంతృప్తికరంగా పనిచేయాలని భావించి పనిచేశారు. బిసిఎస్సిఎస్టి మైనారిటీల సాధికారత కోసం ప్రణాళిక రూపొందించారు.విద్యవైద్యపరంగా సహాయం,ఆర్దికసాధికారిత అన్నివర్గాలలోని మహిళలకు సాధికారిత కల్పించడం ద్వారావారిని సామాజికంగా, ఆర్దికంగా,రాజకీయంగా పైకి తీసుకువచ్చారని వివరించారు.మొత్తంగా చూస్తే బిసి,ఎస్సిఎస్టి,మైనారీటీలకు 70 శాతం పైగా,స్దానికసంస్దలలోను, నామినేటెడ్ పదవులలోఅవకాశం కల్పించారు. కేవలం బిసిలకే చూస్తే 40 శాతం పదవులు ఇచ్చారు.ఏ వేదిక చూసినా వీరే కనిపిస్తుంటారు. బిసిఎస్సిఎస్టి మైనారిటీలు మెజారిటీ సంఖ్యలో కనిపిస్తున్నారు. కేవలం రిజర్వేషన్ తోటే పరిమితమవకుండా జగన్ గారు ముందుకు వెళ్తున్నారు.ప్రజలతో మమేకమై అన్నివర్గాలకు విశ్వాసం పొందేలా చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు,వర్క్స లలో చట్టం చేసి 50 శాతం వారికి దక్కేలా చేశారు. మహిళలు నాయకత్వంలో దొరకక పోతే ప్రస్తుత పార్టీ నేతల భార్యలను ఆ పదవులలో నియమించేలా జగన్ గారు నిర్ణయం తీసుకుని అమలు చేశారు. సంస్కర్తలు మాత్రమే చేయగలరు. చిత్తశుద్దితో చేస్తే ప్రజల ఆశీస్సులు ఉంటాయని జగన్ గారు నమ్ముతారు. అది నిరూపించారు. అందుకే నిబధ్దతతో ఇలాంటి నిర్ణయాాల ద్వారా ఆయా వర్గాలలో నాయకులు తయారుచేయాలనే తపనతో ఉన్నారు.ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రోత్సహిస్తూ వస్తున్నారు.
ఇక్కడ అందరూ గుర్తించాల్సింది ఏమంటే రానున్నఎన్నికలలో మారీచులకంటే మాయోపాయాలు పన్నే,కుట్రలు చేసేవారితో యుధ్దం చేస్తున్నాం. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలనే భావనతో చంద్రబాబు లాంటి వారు ఉన్నారు. బిసిలకు ఎంతగా ప్రయారిటీ ఇస్తారంటే వడ్డెర్లకు సంబందించి చూస్తే గుంటూరులో చంద్రగిరి ఏసురత్నం లాంటి వాళ్ళు ఎంఎల్ ఏగా విజయం సాధించలేని పరిస్దితి ఉంటే ఆయనకు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించారు.ఇది జగన్ గారికి చిత్తశుధ్దికి నిదర్శనం అన్నారు.ఎక్కడ వీలైతే అక్కడ బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తున్నారనేది ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ సమన్వయకర్తల సంఖ్య చూస్తే తెలుస్తుందన్నారు.సిధ్దం సభల ద్వారా జగన్ గారికి ఉన్న ప్రజాదరణ స్పష్టమైందన్నారు.అయినప్పటికీ పచ్చమీడియా సహకారంతో చంద్రబాబు చేస్తున్న విష ప్రచారాన్ని సరైన రీతిలో ఎదుర్కోవాల్సి ఉందన్నారు.ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదన్నారు.పదే పదే అబద్దాలు చెబుతూ ప్రజల మనస్సులలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ముఖ్యంగా రానున్న 50 రోజులు కీలకమైనవన్నారు.బిసి డిక్లరేషన్ అని మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు.ఓటుబ్యాంకుగా వాడుకుని అధికారం వచ్చాక వారిని మోసం చేశారన్నారు.పచ్చమీడియాతో కలసి మాఫియాలాగా తయారు చేసి బిసి డిక్లరేషన్ అంటూ బిసి లను ఉద్దరిస్తానంటూ బయల్దేరారన్నారు.అయితే బిసిలు ఎంతో చైతన్యవంతులైయ్యారని వారికి జగన్ గారు చేసిన మేలు వారికోసం అమలు చేస్తున్న సంక్షేమపధకాలు వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు.
పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడు తో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరు శ్రీ వైయస్ జగన్ గారిపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు.వాటిని నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు. చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు. 2014-19 మధ్య ప్రజలకు ఏమీ చేశారో చెప్పి ప్రజలను ఓట్లడిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మంచి సేవలందుతున్నాయని గర్వంగా చెప్పగలం. మీ హయాంలో దోపీడీలు చేసిన జన్మభూమి కమిటీ లు మళ్ళీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ గారిపై రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ… గొడ్డలి పోటు అంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్ చేసినవన్ని తానే చేసినట్లు గా ప్రచారం చేస్తూ చంద్రబాబు బరితెగించేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేస్తే ఆయనకు టీడీపీ మద్దతు ఇస్ద్తోందన్నారు.అదే జయరాం మంత్రిగా ఉండగా చంద్రబాబు అనుకూల మీడియా లో జయరాం అక్రమాలు అంటూ ప్రచారం చేశారని ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలియచేశారు. చేతగాని అసమర్దులు,దద్దమ్మలు చేసేపని చంద్రబాబు చేస్తున్నారని తెలియచేశారు. ధైర్యం ఉంటే అధికారంలో ఉండగా చంద్రబాబు ఏమీ చేశాడు…అధికారంలోకి వస్తే ఏమీ చేయగలడో చెప్పాలని డిమాండ్ చేసారు.స్కామ్ లో ఇరుక్కుని జైలులో ఉండగా అన్ని రకాల రోగాలు తనకే ఉన్నాయని చంద్రబాబు ఏడుపులు ఏడ్చి ఇప్పుడు మాత్రం పెద్ద అరుపులు అరుస్తున్నారని ఎద్దేవా చేశారు.
సమావేశంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి,ఓర్సు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.