రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తణుకు : సమాజ సేవలో వలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల, వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు శ్రీ బాలగంగాధర తిలక్ మునిసిపల్ ఆడిటోరియంలో మంగళవారం తణుకు రూరల్ పరిధిలోని వలంటీర్లకు నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రజాసౌకర్యార్థం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన వలంటీరు వ్యవస్థ అవ్వాతాతలు, దివ్యాంగులకు అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ఈ జన్మలో మనం చేసే మంచి ఈ జన్మలోనే మన పిల్లలకు అందుతుందని నమ్ముతానని వారి దీవెనలు మీ ఇంటిల్లిపాదికి మంచి చేకూరుతుందని స్పష్టం చేశారు. మీ నివాస పరిధిలోని మీకు కేటాయించిన ఇళ్లలో మీరు ఎంతో గౌరవింపబడుతున్నారని ఆ అదృష్టాన్ని మీకు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కోవిడ్ రెండేళ్లు కూడా వలంటీర్లు అందించిన సేవలకు కొలమానం లేదని, ప్రజాదీవెనలే మీకు శ్రీరామరక్షగా పనిచేస్తాయని అన్నారు. కులం, మతం, పార్టీ బేధాల్లేకుండా సంక్షేమం అందించమన్న జగనన్న ఆదేశాలు తూచాతప్పకుండా పాటించి వలంటీర్లు అందరి మనసులు గెలుచుకున్నారని అన్నారు.
50 ఇళ్లకు ఒక వలంటీరు : 50 ఇళ్లకు ఒక వలంటీరును ఏర్పాటుచేసి వారికి సంక్షేమం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప ఆలోచన చేశారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూరు శాతం పారదర్శకంగా సంక్షేమం అందుతుందని స్పష్టం చేశారు. వలంటీరు చేస్తున్న సేవలకు వృద్ధులు, పింఛనుదారుల ముఖాల్లో చిరునవ్వు, సంతోషం కనిపిస్తోందని, పింఛన్లతోపాటు ఏ కుటుంబానికి ఏ సంక్షేమం ఇవ్వవచ్చో అనే విషయాన్ని లబ్దిదారులకు తెలియచెప్పి సదరు సంక్షేమాన్ని అందిస్తున్న వలంటీర్లు అభినందనీయులని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ సేవా మిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులు సాధించిన వలంటీర్లను ప్రత్యేకంగా సత్కరించి ధృవపత్రాలు, మెడల్స్ అందచేశారు. వైఎస్సార్సీపీ తణుకు మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి. శ్రీ లలిత, ఎంపీపీ రుద్రా ధనరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు ముళ్లపూడి అన్నపూర్ణాదేవి. ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, తణుకు నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి సత్యరాజేంద్రప్రసాద్, తణుకు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు జంగం ఆనంద్ కుమార్, సర్పంచ్ లు అడ్డా బాబు, చిన్నయ్య, కరిబండి రాజేష్, పాలా శ్రీను, సత్యనారాయణ, వేల్పూరు గ్రామ అధ్యక్షులు నున్న దుర్గాప్రసాద్, దువ్వ గ్రామ అధ్యక్షులు శిరిగినీడి గోపాలకృష్ణ. ముద్దాపురం గ్రామ అధ్యక్షులు బుల్లి నాగు, ఎంపీటీసీ సభ్యురాలు చుండ్రు శ్యామల కుమారి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉండవలి జానకి తదితరులు పాల్గొన్నారు.