విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రతిరోజూ జరిగే నిత్య అన్నదాన పధకానికి హైదరాబాద్ కొండాపూర్ కి చెందిన పర్వతరెడ్డి తేజదీప్ రూ.1,00,001/-లను ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాళంగా అందించారు. దాతకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనము కల్పించి, వేద పండితులచే వేదాశీర్వచనం, అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందించారు.