ఆత్మీయ సమావేశంలో కాపు నాయకుల ప్రశంసలు
విజయవాడ : కాపు సామాజిక వర్గానికి సీఎం జగనన్న, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు కాపు సామాజిక వర్గ ప్రముఖులు అభినందనలు తెలిపారు. విజయవాడ భవానీపురంలోని వైసిపి రాష్ట్ర నాయకులు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు ఆకుల శ్రీనివాస కుమార్ స్వగృహంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పలువురు కాపు ప్రముఖులు పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో సహృదయంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గ కళ్యాణ మండపం కోసం భవానిపురం 42 డివిజన్లో 480 గజాల స్థలాన్ని కేటాయించడం పట్ల వారు సీఎం జగన్ కు,అలాగే విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి , కార్పొరేటర్లు మహదేవు అప్పాజీ రావు, యలకల చలపతిరావు, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య, అత్తులూరి ఆదిలక్ష్మి , ఫ్లోర్ లీడర్లు , సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు . కాపులంతా ఐక్యంగా అభివృద్ధి చెందాలని పలువురు నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సంఘటితంగా ఉండి అభివృద్ధి చెందడం అవసరమని అన్నారు. ఆత్మీయ సమావేశంలో పలువురు కాపు కార్పొరేటర్లు , వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.