విజయవాడ : స్థానిక నైజాం గేట్ సెంటర్ లోని మసీద్ ఇ మొహమ్మది అహలేసున్నత్ వాల్ జమాత్ కు జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూపు చైర్మన్ షేక్ గయాసుద్దీన్(ఐజా) లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. సోమవారం మధ్యాహ్నం మసీదు పెద్దల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన గయాసుద్దీన్ మసీదు అభివృద్ధి కోసం ఈ విరాళాన్ని అందజేశారు. ధార్మిక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న గయాసుద్దీన్ కు ముస్లిం ప్రముఖులు, మత పెద్దలు అభినందనలు తెలియజేశారు. మంచి మనసుతో సామాజిక సేవా దృక్పథంతో ధార్మిక చింతనతో పనిచేస్తున్న గయాసుద్దీన్ చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని వారు ఆయనను అభినందించారు.