23వ డివిజన్లో రివర్స్ గేర్
ఆర్భాటంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి బలవంతపు చేరికలు
మూడు దినాల్లోనే ఛీ కొట్టి సొంతగూడు వైస్సార్సీపీలో చేరిన వైనం
రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల సమక్షంలో పార్టీలో తిరిగి చేరిక
అభివృద్ధికే మా ఓటు… ఆదాలన్నకే మా మద్దత్తు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కళ్యాణ్ నగర్ కు చెందిన గుండెబొమ్మ రవి దంపతులు, కూరాకు నరసింహులు దంపతులు వైసీపీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరారు. గత నెల 29వ తారీఖున రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పైన పేర్కొన్న నాయకులు ఆయన నాయకత్వాన్ని ఛీ కొట్టి తిరిగి తమ సొంత పార్టీ అయినా వైఎస్ఆర్సిపిలో అభివృద్ధి ప్రదాత వైఎస్ఆర్సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చేరారు. ఆదివారం సాయంత్రం 23 వ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, క్లస్టర్ -2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి నెల్లూరు ఎంపీ కార్యాలయంలో రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. తమకు వైస్సార్సీపీ అంటే ఇష్టమని, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల వందలాది రూపాయలు నిధులు తీసుకొచ్చి శరవేగంగా అభివృద్ధి చేస్తున్న రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదాలన్నకే మా ఓటు, మద్దత్తు అని గుండెబొమ్మ రవి దంపతులు, కూరాకు నరసింహులు దంపతులు స్పష్టం చేశారు. పార్టీలోకి తిరిగి చేరిన వారికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైస్సార్సీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని గమనించి వారి సంపూర్ణ మద్దతు తెలిపేందుకు తిరిగి పార్టీల చేరిన రవి, నరసింహులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం వచ్చినా…సమస్య వచ్చినా అన్ని విధాల అండగా ఉంటానని వైస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. తిరిగి సొంత పార్టీలో చేరిన గూడెబొమ్మ రవి, కూరాకు నరసింహులు దంపతులను నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు వై.మల్లికార్జున్ రెడ్డి, మస్తాన్ రెడ్డి , వీ.మల్లికార్జున్ రెడ్డి, డి ఆర్, రాజా, వెంకటేశ్వర్లు, జలాల్,తదితరులు పాల్గొన్నారు.