ఉత్తరాంధ్రలో కనీసం 4 పార్లమెంట్ సీట్లు, 18 అసెంబ్లీ స్థానాలను వెలమలకు కేటాయించాలి
నాటి బలం కోసమే….నేడు ఈ పోరాటం
రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బి. తిరుపతి నాయుడు
విజయవాడ : రాష్ట్రంలో కొప్పుల వెలమలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. తిరుపతి నాయుడు పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని వెలమ సంఘాలను కలుపుకొని ( కొప్పుల) వెలమలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం కోసం రాబోయే ఎన్నికల్లో వెలమలు అధికంగా ఉన్నస్థానాల్లో పోటీ చేసేవిధంగా అన్నిరాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఉత్తరాంధ్రలోని ఉనికి కోసం (కొప్పుల )వెలమ సామాజిక వర్గం ప్రయత్నమన్నారు. రెండురోజులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయపార్టీల అధ్యక్షులను కలసి రాబోయే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన వెలమలకు ప్రాధాన్యత కలిగించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రలోని కనీసం 4 పార్లమెంట్ సీట్లకు 18 అసెంబ్లీ స్థానాలను వెలమలకు కేటాయించాలని రిజర్వేషన్ కారణంగా మేము ఒకప్పుడు ప్రాతినిధ్య వహించిన స్థానాలను కోల్పోయిన కారణంగా ఆ ప్రాంతంవారికి ఎమ్మెల్సీలోగాని రాజ్యసభకు మరియు నామినేటెడ్ పదవులను కేటాయించి ఆప్రాంతంలో మాఉనికిని కాపాడాలని రాష్ట్రంలోని అన్ని ప్రధానపార్టీలను కోరడం జరిగిందని సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చుక్క చినబాబు తెలిపారు.
ప్రధాన రాజకీయపార్టీలు ఉత్తరాంధ్రలోని రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులను నిర్ణయించేటప్పుడు ఆనియోజకవర్గాల్లో అధిక జనాభాకలిగిన కొప్పులవెలమ కుల సంఘములోని నాయకులను పరిగణంలోకి తీసుకొనికారణంగా దీనికి నిరసనగా ఉత్తరాంధ్ర కొప్పలవెలమ సంక్షేమ సంఘం తరపునుండి ఉత్తరాంధ్రలోని అన్ని రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను మాకు అనుకూలమైన వారిని పోటీలో పెట్టాలని నిర్ణయించుకున్నామని రాష్ట్ర కొప్పులవెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మినేని తిరుపత నాయుడు తెలిపారు. జనరల్ స్థానాల్లో కూడా మా సంఖ్యాబలం అధికంగా ఉండి కూడా మమ్మల్ని గుర్తించకుండా ప్రధాన రాజకీయపార్టీలు టికెట్లను మాకు నిరాకరిస్తే ఆ స్థానాల్లో కూడా మా అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి నిలిపి మా ఉనికిని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవాలని నిర్ణయించడం జరిగిందని ఉత్తరాంధ్ర కొప్పుల వెలమ సంక్షేమసంఘం వ్యవస్థాపకులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. మేము పోటీకి నిలబెట్టిన అభ్యర్థులకు అన్ని సంఘాలు మద్దతుకోరి వారి గెలుపునకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్రంలో ఇతర సంఘాలకు తెలిపామని కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గ దేవుడు, కూనిరెడ్డి శ్రీనివాస్, చిన్నం నాయుడు, వెంకటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.