సహాయ నిధి ద్వారా రూ.5 లక్షల చెక్ అందజేసిన డిప్యూటీ సిఎం
దేవరాపల్లి : ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు డబ్బుతో ముడిపడిన సమస్య ఏదైనా పెద్దదే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఆఖరి ఆశాదీపం ఏదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి సహాయనిధి అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ఎ.కొత్తపల్లి గ్రామానికి చెందిన కర్రీ అప్పలనాయుడు సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రమాదంలో తన రెండు కాళ్ళు కోల్పోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదు. మంత్రి బూడి ముత్యాలనాయుడు గడప గడపగడపకు కార్యక్రమంలో బాధితుడిని చూసి తానే సమస్యను తెలుసుకుని వెంటనే స్పందించి అతని వైకల్యం పట్ల మంత్రి మానవత్వంతో చలించారు. సదరు వికలాంగుడు విజ్ఞప్తి మేరకు మంత్రి అతనికి రూ.5 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు. ఈ చెక్ ను స్వయంగా మంత్రి లబ్ధిదారుని గ్రామానికి వెళ్ళి అందజేశారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, గ్రామస్తులు ఉన్నారు.