కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 4న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయానికి శంకుస్థాపనకు చేయనున్న సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. జగన్నాథగట్టు పై నిర్మించనున్న జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిప్యాడ్, సభా వేదిక ఏర్పాట్ల పై క్ష జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య తో కలిసి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి/రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న పైలాన్, సభా వేదిక ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సుమారుగా రెండు వేల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని అందుకనుగుణంగా ఏర్పాట్లను చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు సూచించారు. పైలాన్ కు ఇరువైపుల బ్యాక్ డ్రాప్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు సూచించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో లెవెలింగ్ పనులను జిల్లా ఇంఛార్జి మంత్రికి కలెక్టర్ వివరించారు.అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ హెలిపాడ్, వేదిక, సభా ప్రాంగణం లెవెలింగ్ పనులను పూర్తి చేయాలని, పనులు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.