గుంటూరు : ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన పలు వినతులను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్బంగా మున్సిపల్ కార్మికుల తరపున పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ నాయకులు తాడేపల్లి లో మంత్రి సురేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి, అందుకు మంత్రి గా మీరు అందించిన సహకారానికి రుణపడి ఉంటామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎ పి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి ఐ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి సోమయ్య, కార్యదర్శిలు టీ ముత్యాలరావు, టి. నూకరాజు, రాష్ట్ర నాయకులు జి అప్పారావు నాయుడు, పి శ్రీనివాసరావు తదితరులున్నారు.