అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైసీపీ , టీడీపీ పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరగా మద్దాల గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. దీంతో ఇటీవలే విచారణ ముగించిన స్పీకర్ వారిపై వేటు వేశారు.