విజయవాడ : కుప్పం నియోజక వర్గానికి కృష్ణా జలాలను అందించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, చంద్రబాబును సీఎం కుర్చీలో సుదీర్ఘకాలం కూర్చోబెట్టిన ప్రజలకు ఆయన చేయలేని అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం యుద్ధ ప్రాతిపదికన కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి, కృష్ణా జలాల నీటిని చెరువులకు విడుదల చేసి కెనాల్ కు జాతికి అంకితం చేశారని అన్నారు. ప్రాంతాల బేధం లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు.
ప్రజా ప్రయోజనాలు కాపాడటమే వైఎస్సార్సీపీ విధానం : కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజల ప్రయోజనాలకు కాపాడడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానమని, సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషమే ముఖ్యమంత్రి లక్ష్యమని విజయసాయి రెడ్డి అన్నారు.