విజయవాడ : మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా నేత ఒకరు ఎయిమ్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే, సీఐ ఆ నేతపై దాడి చేశాడని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు. యువ మోర్చా నేత ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదన్నారు. రాజకీయాలతో పని లేకుండా ఏపీకి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే ఎయిమ్స్ కు నిధులు అందించిందని, ఈ విషయం తప్పని నిరూపిస్తే రూ.1 లక్ష బహుమానం ఇస్తామని తమ నేత ప్రకటించారని పురందేశ్వరి వివరించారు. అందులో అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది ఏముందని ప్రశ్నించారు. సదరు సీఐపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.