అమరావతి : టీడీపీ-జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు. అధికారికంగా రేపు (శనివారం) ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీ అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారు. 60 నుంచి 70 సీట్లు ప్రకటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని రెండు పార్టీలు ఆయా పార్టీల లీడర్లకు సమాచారం ఇచ్చాయి. ఉదయం 9 గంటల వరకల్లా పార్టీ ఆఫీసుకు చేరుకోవాలి ఆదేశాలు జారీ చేశారు. తొలి జాబితాకు ఉదయం 11:40 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. మరోవైపు బీజేపీతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటివరకు వేచి ఉండకుండా వివాదం లేని స్థానాలను తొలి జాబితాలో ప్రకటించిన ఇరు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపాలని నిర్ణయించినట్లు సమాచారం.