వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్
నరసన్నపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27వ తేదీన పార్టీ ముఖ్య సమావేశాన్ని నిర్వహించనున్నారని దీనికి జిల్లా నుంచి ఆహ్వానితులంతా తప్పక హాజరుకావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ కోరారు. గుంటూరు మంగళగిరి సి.కె.కన్వెన్షన్ హాల్ నందు 27వ తేదీ మంగళవారం జరిగే ఈ కీలకమైన సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, జేసీయస్ మండల ఇంచార్జిలు, నియోజకవర్గ ఎన్నికల బూత్ ఇంఛార్జ్, జేసీయస్ నియోజకవర్గ ఇంఛార్జ్, పార్టీ పరిశీలకులు, జిల్లా జేసీయస్ కో-ఆర్డినేటర్లు తప్పనిసరిగా పాల్గొనేలా ఆయా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు జరిగే ఈ కీలక సమావేశానికి పై ఆహ్వానితులంతా తప్పనిసరిగా హాజరు కావాలని కృష్ణదాస్ కోరారు.