తిరుమల : ‘మీడియాపై దాడి తప్పో, ఒప్పో నేను చెప్పలేను.. జర్నలిస్టులపై దాడిని నేను సమర్థించను. జర్నలిస్టుల దాడిపై తానేమి మాట్లాడిన సెన్సేషనల్ అవుతుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైయస్ఆర్ కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందని, అలాంటి పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఉండడాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. షర్మిల టీడీపీ బాణమో.. కాంగ్రెస్ బాణమో.. బీజేపీ బాణమో అర్ధం కావడం లేదన్నారు. పదవి కోసమే షర్మిల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. నవరత్నాలు వల్ల లాభం లేదని షర్మిల అంటాఉందని, ఇక దేని వల్ల లాభమో షర్మిల ప్రజలకు చెప్పాలన్నారు. ప్రతిపక్షాలంతా ఏకమై జగన్ను ఓడించాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కుల పిచ్చితో పవన్ కళ్యాణ్ కులాలు, మతాలను రెచ్చగోటుతున్నారన్నారు. గతంలో చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసి ఇప్పుడు చంద్రబాబుని సీఎం చేస్తా అంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విరుచుకుపడ్డారు.