తిరుమల : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ వైఎస్ షర్మిళ కు రాజకీయ అవగాహన లేదని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారని రోజా తెలిపారు. శుక్రవారం మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు. 6100 పోస్టుల భర్తీకీ ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. తెలంగాణ బిడ్డని, అక్కడి ప్రజలకు అండగా ఉంటానని, నాలుగున్నరేళ్ల తరువాత షర్మిళ ఏపీకీ వచ్చి నానా యాగి చేస్తున్నారన్నారు. జగన్ పై షర్మిళ విషం చిమ్ముతున్నారన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిళని పావుగా వాడుతున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్థిలో అన్నాచెల్లెలు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలన్నారు.