నిస్వార్ధసేవకు నిండు మనస్సుతో అభినందనలు — ఎంపీ ఆదాల
1, 2, 12,17, 18, 19 డివిజన్ల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలతో సత్కారం
నెల్లూరు : నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం తరఫున పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇంచార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నిస్వార్ధంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా సేవలు అందిస్తున్న వాలంటీర్ సోదర, సోదరీమణులను నిండు మనసుతో అభినందిస్తున్నానని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మానవసేవే మాధవ సేవగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధనలో కీలకభూమిక పోషిస్తున్న వాలంటీర్ సోదర, సోదరీమణులకు భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుందని ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిస్వార్థంతో ప్రజా సేవలందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను, పథకాలను ఎప్పటికప్పుడు అవినీతి రహితంగా, ఎటువంటి దళారీ వ్యవస్థకు చోటు లేకుండా ముఖ్యమంత్రి జగనన్నకు సైనికులుగా నిలబడిన గ్రామ, వార్డు, సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల అందరిని మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తున్నానని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు మంగళవారం నెల్లూరు నగరంలోని రామ్మూర్తి నగర్ లోని పరమేశ్వరి కళ్యాణమండపంలో 1, 2, 12,17, 18, 19 డివిజన్ల వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డులు పొందిన వాలంటీర్లకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంస పత్రాలు, షీల్డ్స్ అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, క్లస్టర్ -1 అధ్యక్షుడు ముడియాల రామిరెడ్డి, 1, 2 డివిజన్ల కార్పొరేటర్లు జానా నాగరాజ్ గౌడ్, పి రామ్మోహన్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి,లేబురు పరమేశ్వర్ రెడ్డి, వాల్మీటి లక్ష్మీ నర్సారెడ్డి నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒట్టూరు సుధాకర్ యాదవ్, నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి, 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, పాముల రమణయ్య, 18 వ డివిజన్ కార్పొరేటర్ టి అశోక్ కుమార్, జిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి వేలూరు శివ సునీల్ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ ధారా వంశీ, 19వ డివిజన్ ఇన్చార్జీలు వారాల లక్ష్మీనారాయణ, పచ్చ రవి, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తదితరుల తో పాటు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచల రెడ్డి, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ సిహెచ్ హరిబాబు యాదవ్, జిల్లా వైఎస్సార్సీపి మహిళా అధ్యక్షురాలు మొయిల్లా గౌరీ, జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, జడ్పిటిసి సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ లక్ష్మీసునంద వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డు సచివాలయాల సిబ్బంది, సన్మాన గ్రహీతలైన వాలంటీర్లు పాల్గొన్నారు.