అమరావతి : ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సోమవారం మధ్యాహ్నం ఈశ్వరీ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభమైంది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ పి సత్యనారాయణన్ వర్సిటీ పాలకమండలి సభ్యులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగిన సభలో విద్యార్థులు, ప్రొఫెసర్లను ఉద్దేశించి డాక్టర్ సత్యనారాయణన్ ప్రసంగించారు. తన తల్లి గారైన ఈశ్వరీ దేవి పేరున ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన లిబరల్ ఆర్ట్స్ స్కూల్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనను కొనసాగిస్తామన్నారు. బీఎస్సీ, బీఏ చదివే విద్యార్థుల కోసం వివిధ రకాల కోర్సులను ప్రవేశ పెట్టామనీ, సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ వంటి సబ్జెక్టుల్లో పీహెచ్ఎ ప్రోగ్రామ్స్ కూడా ప్రారంభిస్తున్నామన్నారు. వీటిని చదివేందుకు దూర ప్రాంతాలకు పరుగులు తీయకుండా ఆంధ్రాలోనే క్రమశిక్షణ గల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించామన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్‌కుమార్ అరోరా మాట్లాడుతూ, ఈశ్వరీ లిబరల్ ఆర్ట్స్ స్కూల్‌ను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు కోసం డీన్ డాక్టర్ విష్నుపడ్తో పాటు ఫ్యాకల్టీలందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. అనంతరం యూనిర్సిటీ పాలక మండలి సభ్యులు డాక్టర్ నికోలస్, డాక్టర్ జానికీ బాక్లే, ప్రశాంత్ మహాపాత్రో, డాక్టర్ గోపాల్ గురు, డాక్టర్ చందన్ గౌడ, డాక్టర్ ప్రదీఫ్ ఖోస్లా తదితరులు ప్రసంగించారు. యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణన్ వీరందరినీ దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. డాక్టర్ సత్యనారాయణన్ ఈశ్వరీ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ ప్రత్యేకతలను లిబరల్ ఆర్ట్స్ స్కూల్ అంతర్జాతీయంగా ఆదరణ పెరుతొంది. దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం నిజం సంతోషం. నూతన స్కూల్ కు మార్పు మాత్రమే కాదు అన్ని మార్పులు ఈ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ లో ఉన్నాయి. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ కుమార్, డీన్ డాక్టర్ విష్ణుపథ్ తదితరులు పాల్గొన్నారు.