విజయవాడ : ఈజిప్టులో నవంబర్ 5 -6 రోజుల్లో నిర్వహించినటువంటి ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్ 27) లో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ 2022 కి ప్రతిష్టాత్మకమైన ‘ఫ్యూచర్ ఎకానమీ లీడర్షిప్ అవార్డు’ లభించింది. ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో రైతు సాధికర సంస్థ కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రైతు సాధికర సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ సూత్రాలను అమలు చేస్తోంది. సంస్థ తరపున, పునరుత్పత్తి వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న విజయ్ కుమార్, కాప్ 27 సెమినార్లో ప్రసంగించారు.