ఎయిమ్స్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తిగా సహాయసహకారాలు అందజేస్తోందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ త్రిపాఠి ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యను తీసుకెళ్లినా వెనువెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసిందని, పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఎయిమ్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.