మరోవైపు ఎయిమ్స్‌లాంటి సంస్థను మన రాష్ట్ర హక్కుగా రాష్ట్ర విభజనానంతరం మనం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందితే చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ సంస్థకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నా, ఒక పరిశ్రమను నెలకొల్పాలన్నా.. ముందు మౌలిక వసతులు సమకూర్చాలనే కనీస కర్తవ్యాన్ని, ప్రాథమిక సూత్రాన్ని చంద్రబాబునాయుడు పాటించలేదని విమర్శించారు. ఎయిమ్స్‌కు కరెంటు ఇద్దామనే ఆలోచనే చేయలలేదని మండిపడ్డారు. కనీసం రోడ్లు కూడా నిర్మించి ఇవ్వలేదని తెలిపారు. మంచినీటి సమస్య ఉందని మొత్తుకున్నా.. కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.