కక్ష్యలోకి ఇన్సాట్-3డీఎస్
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహక నౌక ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. 18.46 నిమిషాల అనంతరం 2,275 కిలోల బరువు ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇన్సాట్-3 డీఎస్‌ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఇది పనిచేస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఇన్సాట్-3డీఎస్‌తో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందన్నారు.
జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపించారు. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి.