జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్
విజయవాడ : టోపి పెట్టుకోని ముస్లిం తానని జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అన్నారు. ముస్లిం సమస్యలపై పశ్చిమ నియోజకవర్గంలో అనేక పోరాటాలు నిరంతరం చేశామని పోతిన తెలిపారు.
జుమ్మా మసీద్, ముసాఫిర్ ఖానా ,అస్లాం మృతి కేసు, హజ్ హౌస్ తరలింపు, గాలి షాహిబ్ దర్గా భూములు కబ్జాపై నిరంతరం పోరాటం చేసిన ఏకైక పార్టీ ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. తాను ముస్లింల కోసం చేసిన పనులను వివరించారు. ఏడు సంవత్సరాలుగా పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని మదర్సా అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయల విరాళ అంద చేసిన పవన్ కళ్యాణ్ ముస్లింల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టిడిపి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ శుక్రవారం ట్రాక్టర్స్ స్పేర్స్ అసోసియేషన్ దగ్గర ప్రచారం నిర్వహించారు. ట్రాక్టర్స్ స్పేర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాంద్ సహకరించి సభ్యులందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడించారు. మనం ఈసారి పోతిన మహేష్ కి మద్దతు ఇవ్వాలని, జనసేన టిడిపి కి అండగా నిలబడాలని ప్రతి ఒక్కరికి తెలిపారు. అందరూ కూడా ఈసారి మహేష్ కి అండగా నిలిచి జనసేన టిడిపికి మద్దతు ఇస్తామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పడానికి ఇష్టపడలేదని తండ్రి ఫోటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక తండ్రి ఫోటోని తీసేసినటువంటి దుర్మార్గుడని, షర్మిల చెప్పిన మాటకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వైయస్సార్ పార్టీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి లేరని చెప్పారని వై అంటే వై వి సుబ్బారెడ్డి అని ఎస్ అంటే సాయి రెడ్డి అని ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని షర్మిల చెప్పారని వైయస్సార్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు ఉంటారని తండ్రిని తీసేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నామని మహేష్ అన్నారు. కార్యక్రమంలో పొట్లూరి శ్రీనివాసరావు, గంగాధర్, గోపాల్, శనివారపు శివ, ఏలూరు సాయి శరత్, బోట్ట సాయి,ట్రాక్టర్స్ స్పేర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.