బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం నారాయణపేట జిల్లా దామరగిద్ద. ఆత్మతత్వం, జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేస్తారు. రామాయణం, మహాభారతం, హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరణిక గాథలను వీణ వాయిస్తూ చెబుతారు. బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు. గతంలో దూరదర్శన్‌లోను ప్రదర్శనలిచ్చారు. దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప, వెంకటమ్మ. ఈయన భార్య వెంకటమ్మ చనిపోయింది. కొడుకు రాము ఉన్నారు. మరో కొడుకు కొండప్ప రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తన బుర్రవీణను ఆయనే తయారు చేస్తారు. బలగం సినిమాలో ‘అయ్యే శివుడా ఏమాయే’ పాట పడినట్లు చెప్పారు. గతంలో మహబూబ్‌నగర్‌లోని ఓ కస్తుర్బా పాఠశాలల విద్యార్థులకు బుర్రవీణపై శిక్షణ ఇచ్చారు. ఇప్పుడూ కూడా కొందరికి నేర్పిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప కూలీనాలీ చేసుకోవడంతో పాటు ఏదైనా పండగలు, కార్యక్రమాలు జరిగినప్పుడూ బుర్రవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్ది పాటి డబ్బులతో జీవిస్తున్నారు.