విజయవాడ : సెంట్రల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావుతో సెంట్రల్ వైస్సార్సీ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు సోమావారం నాడు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా పలు సమస్యలను కార్పొరేటర్లు కలెక్టర్ దృష్టికి తీసికోచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడితు స్థానిక ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన వివిధ సమస్యలను క్షుణ్నంగా పరిశీలించడం జరుగుతోందని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. వెలంపల్లి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలపై చర్చించమన్నారు.ఓటీఎస్ పట్టాలు,ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ,గుణదల ఆర్వోబీతో పాటు పలు భూ అంశాలపై చర్చించమన్నారు.నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే 22ఏ నుంచి తొలగించిన సర్వే నంబర్ల వివరాలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమం లో శాసన మండలి సభ్యులు రుహుల్లా,జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్,నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి నియోజకవర్గం కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.