విజయవాడ : రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా ఏ పీ సీ ఎన్ ఎఫ్ పేరుతో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు 15 మందితో కూడిన బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో చేపట్టనున్న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ బృందం సభ్యులు ఈ నెల 19న కృష్ణా జిల్లాలో పర్యటించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం స్థాపించిన “పల్లి కర్మ సహాయక ఫౌండేషన్ ”సీనియర్ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. 1 కోటి 75 లక్షల మంది సభ్యత్వం కలిగిన పల్లి కర్మ సహాయక ఫౌండేషన్ సంస్థ బంగ్లాదేశ్ లో పేదరిక నిర్మూలనలో అత్యంత ప్రధాన భూమిక పోషిస్తుంది. సంస్థ సభ్యుల్లో 90 శాతం పైగా మహిళలే ఉన్నారు. ఈ సంస్థ వివిధ రంగాలలో కృషి చేస్తున్న వేర్వేరు ఎన్జీవో ల భాగస్వామ్యం కలిగి ఉంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న బృందంలో ఫౌండేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ అకోండ్ మొహమ్మద్ రఫీకుల్ ఇస్లాం, జనరల్ మేనేజర్తా ఫిక్ హస్సన్ షా చౌదురి, మేనేజర్లు ఆఫ్రిన్ సుల్తానా, కపిల్ కుమార్ పాల్ , అసిస్టెంట్ మేనేజర్లు ఎం డీ ఇస్రైల్ హోస్సైన్, శంసాద్ ఫర్జానా, రూరల్ మైక్రో ఎంటర్ ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు, డిప్యూటీ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఏ కే ఎం జహీరుల్ ఇస్లాం, సెక్టార్ వాల్యూ చైన్ స్పెషలిస్ట్ ఎండీ రఫీజుల్ ఇస్లాం, వాల్యూ చైన్ ప్రాజెక్టు మేనేజర్ ఎండీ ఇరఫామ్ అలీ, ఐసీటీ స్పెషలిస్ట్ సజాల కుమార్ దాలీ, అసిస్టెంట్ మేనేజర్ అబూ సలే ఎండీ రజీబ్, ఏ కే ఖాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం ఏ జలీల్, ఢాకా ఎలెక్ట్రిక్ సప్లయ్ అథారిటీ ప్రాజెక్టు మేనేజర్ ఎం డీ సైదుర రహమాన్, హీధర్ హౌస్ అసోసియేట్ మిళింద్ సక్సేనా, పార్టనర్ డాక్టర్ మధుశ్రీ బెనర్జీ, నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ప్రతినిధి స్మితా జాకోబ్ లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ బృంద సభ్యులు వ్యవసాయం, కీటక శాస్త్రం, పౌష్టికాహారం, వెటెరినరీ తదితర రంగాలలో విశేష నైపుణ్యం గలిగినవారు.హీధర్ హౌస్ విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ సర్టిఫికేట్ కోర్సు లను నిర్వహించడం, విజ్ఞాన యాత్రలను ప్రోత్సహించడం వంటి చర్యలను చేపడుతుంది.
తొలి రోజు 19 వ తేదీన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ గన్నవరంలోని పార్క్ ఎలైట్ హోటల్ లో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ క్రమంలో ఇటీవల చోటుచేసుకొన్న మిషాంగ్ తూఫాన్ ను అధిగమించిన ప్రకృతి వ్యవసాయ పంటలపై రూపొందించిన వీడియో ను ప్రదర్శించారు. ఎదుర్కొన్న తట్టుకొని నిలబడ్డ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలపై అంతకు ముందు బృంద సభ్యులు బంగ్లాదేశ్ దేశంలో తమ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం లో తెలుసుకోగోరు పద్ధతులను వివరించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ఆరంభ స్థాయి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రగతిని, సాధిస్తున్న సత్ఫలితాలను బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం కు స్పష్టం చేశారు. ప్రెసెంటేషన్ ముగిసిన అనంతరం బృంద సభ్యులు అడిగిన సందేహాలను శ్రీ విజయ్ కుమార్ నివృత్తి చేశారు. క్షేత్ర పర్యటనలో భాగంగా ఈ బృందం తొలి రోజు కృష్ణా జిల్లాలోని బాపులపాడు గ్రామంలో రైతు సాధికార సంస్థ అధికారులు జీవ ఎరువుల తయారీ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన లైవ్ డెమాన్సట్రేషన్ లో బీజామృతం, ద్రవ జీవామృతం తయారీని పరిశీలించారు. ఆనంతరం ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలను పొందుపరుస్తూ వేసిన “ప్రకృతి వ్యవసాయ చక్రం” ను సందర్శించారు. అదే గ్రామంలో రవి కుమార్ అనే రైతుకు చెందిన “వెజిటబుల్ మోడల్” ను కూడా బృందం సందర్శించింది. అనంతరం రామ్ మోహన్ రావు రైతు “పప్పు ధాన్యాలు- అంతర పంటలతో” సాగు చేస్తున్న ఏ గ్రేడ్ మోడల్ ను మరియు ఏ టీ ఎం మోడల్ ను సందర్శించారు. ఈ బృందం కనుమోలు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న కాంపాక్ట్ బ్లాక్ లో నిర్వహించిన “ఫార్మర్ ఫీల్డ్ స్కూల్” లో పాల్గొని ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. అనంతరం కాకులపాడు గ్రామంలో కాంపాక్ట్ బ్లాక్, ఏ గ్రేడ్ మోడల్. రబీ డ్రై సోయింగ్ మోడల్స్ ను సందర్శించారు.