మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదానం
విజయవాడ : ప్రముఖ రాజకీయ నాయకులు గంగవరపు మురళి ఆధ్వర్యంలో సితార సెంటర్ సమీపంలో 45 వ డివిజనులో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28 వ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ నిలువెత్తు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రజలకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అమలు తీరును నెమరు వేసుకున్నారు. ఆయన పరిపాలనా దక్షతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంగవరపు మురళి తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పువ్వుల కాంతరావు, బట్టిపాటి శివ,కొమ్ము రాంబాబు, గద్దె మోహన్, నర్రా వంశీ,జి వి ప్రభాకర్, ఎమ్ నాగేశ్వరరావు, రెడ్డి మోహన్, గాలేషా, టి ప్రసాద్, బి కోటేశ్వరరావు (కోటి) కుంకు మల్లేశ్వరరావు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.